- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోమటిరెడ్డి సోదరుల మధ్య గ్యాప్.. అయోమయంలో అనుచరులు?
తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress)లో కోమటిరెడ్డి సోదరుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress)లో కోమటిరెడ్డి సోదరుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తరచూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy) వ్యతిరేకిస్తుండగా.. వెంకట్ రెడ్డి(Venkat Reddy) మాత్రం వెనకేసుకొస్తున్నారు. సోమవారం రేవంత్ రెడ్డి మరో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాలని వెంకట్ రెడ్డి స్వయంగా గణపతి పూజ చేయించడం చర్చనీయాంశంగా మారింది. ఆ మరుసటి రోజే తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం మోసం చేసిందని.. పార్టీలో సీనియర్‌ను అయిన నాకు ఇవ్వకుండా.. నిన్నా, మొన్న పార్టీలో చేరిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అయినా తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు. మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చారు. ఇస్తారా? ఇవ్వరా? అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. తనకు పదవులు ముఖ్యం కాదు. మునుగోడు నియోజకవర్గ ప్రజలే ముఖ్యం.. అవసరమైతే మరోసారి పదవికి రాజీనామా చేసి.. ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరకు తీసుకొస్తా అని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలే అటు పార్టీ నేతలను, ఇటు వారి అనుచరులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి సోదరుల మధ్య గ్యాప్ వచ్చిందని.. నిత్యం సీఎం రేవంత్‌ను రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకిస్తున్నా.. వెంకట్ రెడ్డి మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా సన్నిహితంగా ఉంటున్నారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. స్థానిక ఎన్నికల వేళ పదే పదే రాజగోపాల్ రెడ్డి వ్యతిరేక రాగం పాడుతుండటం, దీనిపై ఎవరూ స్పందించకపోవడం కలకలం రేపుతోంది. ఈ అంశంపై తక్షణమే అధిష్టానం స్పందించి సాల్వ్ చేయాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నారు.






