సన్న బియ్యం పథకం నిధులు మోడీ ప్రభుత్వానివే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Malleboina Mahesh |

సన్న బియ్యంపై కేంద్రం రూ.42 ఖర్చు పెడుతుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం రూ.15 మాత్రమే ఇస్తోందని, ధైర్యం ఉంటే సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసి చూపించాలని సీఎం రేవంత్​రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సవాల్​విసిరారు.

సన్న బియ్యం పథకం నిధులు మోడీ ప్రభుత్వానివే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : సన్న బియ్యంపై కేంద్రం రూ.42 ఖర్చు పెడుతుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం రూ.15 మాత్రమే ఇస్తోందని, ధైర్యం ఉంటే సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసి చూపించాలని సీఎం రేవంత్​రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సవాల్​విసిరారు. మెట్రోపై రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతుంది. ఎల్ అండ్ టీ దగ్గరి నుంచి స్వాధీనం చేసుకోకుండా , డీపీఆర్ పూర్తి చేయకుండా నాపై ఆరోపణలు చేస్తున్నారు. బట్ట కాల్చి మీద వేయడం సీఎం రేవంత్ రెడ్డికి తగదన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని, ఇలా మాట్లాడటం ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల అమలులో అట్టర్ ఫ్లాప్ అయినా సిగ్గు పడకుండా తిరిగి బరితెగించి ఓటర్లనే బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లిస్ అభ్యర్థిని అద్దెకు తెచ్చుకుని నిలబెట్టినా అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చినా.

గెలుస్తామో లేదోనన్న అనుమానం, భయంతో బెదిరింపులకు దిగుతోందన్నారు.ఎన్నికల ప్రకటన జరిగిన రోజే మజ్లిస్ పార్టీ ఒత్తిడి మేరకు మెహిదీపట్నంలో ఖబరస్థాన్ కోసం విలువైన ఆర్మీ స్థలాన్ని కేటాయించడం, ఎర్రగడ్డ కాలనీల మధ్య, బస్తీల మధ్య మరో స్థలాన్ని ఖబరస్థాన్‌కు ఇవ్వడం, ఇతర తాయిలాలతో ముస్లింలను బుజ్జగిస్తూ ఇతర వర్గాలను భయబ్రాంతులకు గురి చేస్తోందన్నారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీపై అబద్ధాలు మాట్లాడడం ద్వారా మజ్లిస్ పార్టీ మెప్పు పొంది ఓట్లు రాబట్టుకోవాలని కుట్ర పన్నుతోంది. సన్న బియ్యం ఇవ్వడం మానేస్తామంటూ బెదిరింపులకు దిగడం సీఎం హోదాలో మాట్లాడటం ఎంతవరకు సబబు అన్నారు. ఉపఎన్నికలో ఓడిపోతామనే ఫ్రస్టేషనా, కాంగ్రెస్ మార్క్ రాజకీయమో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఓటర్లను బెదిరించడం సిగ్గుచేటు అన్నారు. ఢిల్లీలో బడేమియా రాహుల్ గాంధీ, గల్లీలో చోటే మియా రేవంత్ రెడ్డి దొందూ దొందే ఆర్మీ అంటే వీళ్ళిద్దరికీ ఎప్పుడూ చులకన భావమే ఎప్పుడు కించపరిచేలా మాట్లాడటం అలవాటేనని గతంలో కేసీఆర్ కూడా ఇలాగే మాట్లాడేవారని ఎద్దేవా చేశారు.

పాకిస్తానోడు ముడ్డి మీద తంతే అంటూ సైనికులను ఉద్దేశించి మాట్లాడతారా, ముఖ్యమంత్రి సీటు రక్షించుకోవడం కోసం నెహ్రూ కుటుంబ రక్తాన్ని ఎక్కించుకున్నట్టు కనిపిస్తోందన్నారు. రాహుల్ ఆలోచనల ప్రకారం మాట్లాడితే సీఎం సీటు సేఫ్ అని రేవంత్ భావిస్తున్నట్లున్నారు. సైనికులకు వ్యతిరేకంగా నెహ్రూ కుటుంబం చాలాసార్లు మాట్లాడిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఆర్మీని కించపరచడంలో బీఆర్ఎస్ కూడా తక్కువేమీ తినలేదు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం కేసీఆర్, రేవంత్ రెడ్డి ఏం చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇస్తాంబుల్, సింగపూర్ చేస్తానంటూ పదేపదే చెప్పిన మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఫాం హౌజ్ కే పరిమితమయ్యారు.బీజేపీ తరఫున 50 మహాపాదయాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాం. బీఆర్ఎస్ ఎలా వైఫల్యం చెందిందో కాంగ్రెస్ మోసాలను, మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందో అనేక విషయాలు చెప్పేందుకు ఇంటింటికీ తిరుగుతామని వెల్లడించారు.

Next Story