- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : గరీబోడి పెద్దాసుపత్రి శంకుస్థాపన ఓ గొప్ప జ్ఞాపకం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాని(New Building Of Osmania Hospital)కి శంకుస్థాపన(Foundation Stone)చేయడం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎక్స్ వేదికగా భావోద్వేగంతో స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాని(New Building Of Osmania Hospital)కి శంకుస్థాపన(Foundation Stone)చేయడం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎక్స్ వేదికగా భావోద్వేగంతో స్పందించారు. వందేళ్ల చరిత్రను తిరగ రాస్తూ..పేదోళ్ల వైద్య సేవకు జీవంపోస్తూ శిథిలమైన నిన్నటి ఉస్మానియా జ్ఞాపకాల నుండి శిఖర స్థాయి ప్రమాణాలతో గరీబోడి పెద్దాసుపత్రికి నా చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం ఓ గొప్ప జ్ఞాపకG(A Great Memory)అని రేవంత్ రెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
గోషామహాల్ స్టేడియం స్థానంలో రూ.2,700కోట్లతో అత్యంత ఆధునిక వసతులతో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం నిర్మించనున్నారు. రాబోయే వందేళ్లు ప్రజలు గుర్తుంచుకునేలా ఆత్యాధనిక సాంకేతిక వైద్య సేవలతో కొత్త ఉస్మానియా భవనాన్ని నిర్మించబోతున్నారు. 5 భాగాలుగా ఆసుపత్రి భవనం నిర్మాణం చేయనున్నారు. 26.30ఎకరాల వైశాల్యంలో 32లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో 2వేల పడకలు, ఇందులో 500పడకలను ఐసీయు సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 22వైద్య విభాగాలు అందుబాటులో ఉండగా, కొత్త భవనంలో 40విభాగాలు, 41ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి.
ఆసుపత్రి ప్రాంగణంలోని డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులకు, ఫ్యాకల్టీకి ఆధునాతన వసతులతో కూడిన హాస్టల్ సదుపాయం, 750సీట్ల సామర్ధ్యం ఆడిటోరియం, క్రీడా ప్రాంగణాలు కూడా నిర్మిస్తున్నారు. దాదాపు 3వేల వాహనాలు ఒకేసారి పార్కింగ్ చేసుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. రోజుకు 5వేల మంది ఓపీ రోగులను చూసేలా 30రోబోటిక్ సర్జరీలు చేపట్టే విధంగా కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనంలో సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.
కొత్త ఆసుపత్రి భవనాన్ని రెండేళ్లలో పూర్తి చేయనున్నట్లుగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ తెలిపారు. ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా స్కైవాక్ నిర్మాణం, నాలుగు దిక్కుల విశాలమైన రోడ్లు, అత్యవసర పరిస్థితుల్లో రోగిని తరలించడానికి వీలుగా ఆసుపత్రి ఆవరణలో హెలిప్యాడ్ కూడా నిర్మించనున్నారు.






