అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదా.. బీజేఎల్పీ నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి

by Kema Shiva Kumar |

అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి రైతులపై లేదని బీజేపీ (BJP) శాసనసభ పక్ష నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ఫైర్ అయ్యారు.

అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదా.. బీజేఎల్పీ నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి రైతులపై లేదని బీజేపీ (BJP) శాసనసభ పక్ష నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుండపోత వర్షాల కారణంగా అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. భారీగా పంట నష్టం వాటిల్లి విపరీతంగా నష్టపోయారని కామెంట్ చేశారు. రాష్ట్రంలో సుమారు 2.20లక్షల ఎకరాలల్లో వివిధ రకాల పంటలు నాశనం అయ్యాయని.. బాధిత రైతులకు వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన జిలాల్లో మంత్రులు పర్యటించకపోవడం దారుణమని అన్నారు.

ఒకవేళ దేశానికి అన్నం పెట్టే అన్నదాత మీద నిజంగానే శ్రద్ధ ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఒక్క ప్రకటనైనా ఎందుకు విడుదల చేయలేదని కామెంట్ చేశారు. మూసీ నది పక్షాళన, స్పోర్ట్స్ పాలసీ, అందాల పోటీలపై ప్రభుత్వానికి ఉన్న రైతుల మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూతూమంత్రంగా అసెంబ్లీని మూడు, నాలుగు రోజులు పెట్టాలని చూస్తున్నారని.. ప్రజా సమస్యలపై చర్చించేందుకు కనీసం 30 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తాము అడగబోయే సమస్యలకు సమాధానం చెప్పలేక త్వరగా సమావేశాలకు మంగళం పాడాలని చూస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల బకాయిలు, ఫీజు రియింబర్స్‌మెంట్, యూరియా కొరతపై సభలో చర్చ జరగాలని ఆలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

Next Story