- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sarpanch Elections: తొలి విడత ఫలితాలనుంచి తేరుకున్న నేతలు.. రెండవ విడత కోసం మారిన ప్రతివ్యూహాలు
మెజారిటీ స్థానాల కోసం అభ్యర్థులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రధాన పార్టీల నాయకులకు షాకిచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏకపక్షంగా విజయం సాధిస్తామని భావించిన నేతలకు ఈ ఫలితాలు కళ్లు తెరిపించాయి. దీంతో రెండవ, మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించేందుకు ప్రచార వ్యూహాలను మార్చక తప్పదని నిర్ణయానికి వచ్చారు. రెండవ విడత ఎన్నికలకు ఒకరోజు మాత్రమే గడువు ఉండడంతో ప్రధాన నేతలు ఆయా గ్రామాలపై దృష్టి సారించారు. దీంతో శుక్రవారం ముమ్మరంగా ప్రచారం చేశారు. శనివారం డబ్బు, మద్యం పంపిణీ ద్వారా ఓటర్లను తమ అభ్యర్థుల వైపునకు తిప్పుకోవడానికి ప్రధాన పార్టీల నేతలు వ్యూహరచనలు చేస్తున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వెలువడిన మొదటి విడత గ్రామపంచాయతీ ఫలితాలు ప్రధాన పార్టీల నాయకులు, అభ్యర్థుల మైండ్ సెట్‌ను మారుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరుగుతున్న ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో పల్లెలపై పట్టు సాధించేందుకు అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్షాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు అభ్యర్థుల కోసం ప్రచారాలు చేశారు. ఫలితాలు ఏకపక్షంగా వస్తాయనుకున్న నాయకులకు ఈ ఫలితాలు ఒక రకంగా కళ్లు తెరిపించాయనే అనుకోవాలి. దీంతో రెండవ, మూడవ విడత జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించాలంటే ప్రచార వ్యూహాలను మార్చక తప్పదన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రెండవ విడత ఎన్నికలకు ఒకరోజు మాత్రమే గడువు ఉండడంతో ప్రధాన పార్టీల నేతలు ఆ గ్రామాలపైనే దృష్టి సారించారు. శుక్రవారం ముమ్మరంగా ప్రచారాలు చేశారు. శనివారం డబ్బు, మద్యం పంపిణీ పకడ్బందీగా నిర్వహించి ఓటర్లను తమ అభ్యర్థుల వైపునకు తిప్పుకోవడానికి ప్రధాన పార్టీల నేతలు వ్యూహరచనలు చేస్తున్నారు. ఈ వ్యూహరచనలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయనేది వేచి చూడాల్సిందే.






