- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ ఎన్నికల్లో బాండ్ పేపర్ రాసిచ్చిన తొలి ఎమ్మెల్యే అభ్యర్థి..
సూర్యాపేట నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర రావు నియోజకవర్గ ప్రజలకు ప్రమాణ పూర్వకంగా బాండ్ పేపర్‌పై రాసిచ్చిన లిఖిత పూర్వక హామీ నెట్టింట వైరల్ అవుతోంది.

దిశ, సూర్యాపేట : సూర్యాపేట నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర రావు నియోజకవర్గ ప్రజలకు ప్రమాణ పూర్వకంగా బాండ్ పేపర్‌పై రాసిచ్చిన లిఖిత పూర్వక హామీ నెట్టింట వైరల్ అవుతోంది. ఈనెల 26న రాసిచ్చిన ఈ హామీతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల్లో వణుకు పుట్టిస్తోందని స్థానిక ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో మునుపెన్నడు లేని విదంగా సంకినేని రాసిచ్చిన ఈ హామీ ఓటర్లను ఆలోచింప చేస్తోంది.
సూర్యాపేటలో నన్ను గెలిపిస్తే ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో ఉంటారని, అది తుంగతుర్తి ప్రజలకు బాగా తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రౌడీ రాజకీయం చేస్తే, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భూ కబ్జాలు, అనేక అక్రమాలు జరిగాయని ఈ బాండులో పేర్కొన్నారు. అందుకు భిన్నంగా స్వేచ్చాయుత జీవితాన్ని అనుభవిస్తారని తన హామీలో వెల్లడించారు.
బాండు పేపర్‌లో ఏముందంటే..?
సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లకు,సమస్త ప్రజానీకానికి నమస్కారిస్తూ.....
1). 1999-2004 వరకు తుంగతుర్తి ఎమ్మెల్యేగా గెలిచి ఆ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేశాను.
2). గత 15 సంవత్సరాలుగా సూర్యాపేట అసెంబ్లీ పరిధిలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నేతల హత్యా రాజకీయాలు, రౌడీయిజం, దళారీ వ్యవస్థను నిరోధిస్తాను.
3). అవినీతి, అక్రమాలతో, అధికార దుర్వినియోగంతో దారి మళ్లించిన వందల కోట్ల రూపాయల కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ నిధులను గుర్తించి, రికవరీకి చర్యలు తీసుకుంటాను.
4). భూకబ్జాలు, ప్రభుత్వ, ప్రైవేటు భూముల ఆక్రమణ, అక్రమార్జనపరులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను.
5). చిన్న,పెద్ద వ్యాపారులను భయపెట్టి, బెదిరించి సంపాదించిన అక్రమ ఆస్తులపై విచారణ జరిపిస్తాను.
6). ఎటువంటి తారతమ్యం లేకుండా వ్యాపారులందరికీ స్వేచ్ఛా వాణిజ్యానికి హామీ ఇస్తున్నాను.
7). ప్రస్తుతం నేను మాజీ ఎమ్మెల్యే అయినా సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి ఇతోధికంగా కృషి చేస్తున్నాను.
8). సూర్యాపేట అసెంబ్లీ పరిధిలో మునిసిపాలిటీ, పోలీసు అధికారుల వేధింపులు, తప్పుడు కేసుల నుంచి రక్షణ కల్పిస్తాను.
అందుకు నవంబరు 30న (గురువారం) సూర్యాపేట నియోజకవర్గంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును సీరియల్ నంబర్ 4, కమలం పువ్వు గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నానని ఆయన బాండు పేపర్‌పై తన ప్రమాణ పూర్వక లిఖిత హామీని వెల్లడించారు.






