- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: కాళేశ్వరం కమిషన్ పై తీర్పు వాయిదా
కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ ఏర్పాటు, దాని విచారణ ప్రక్రియపై నేడు హైకోర్టు తుదితీర్పు వెల్లడించాల్సి ఉంది. అనూహ్యంగా తీర్పును 22కి వాయిదా వేసింది.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం కమిషన్ నివేదికపై తీర్పు వాయిదా పడింది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు, దాని విచారణ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది. ఈ క్రమంలో నేడు తీర్పు వస్తుందని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. తీర్పును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. కాళేశ్వరం కమిషన్ నివేదికపై గతంలోనే కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ స్మితా సభర్వాల్, మాజీ సీఎస్ జోషి సవాల్ చేసిన విషయం తెలిసిందే. కొన్నినెలలుగా ఈ పిటిషన్లపై వాదనలు జరిగాయి. మార్చి 12న దీనిపై వాదనలు పూర్తవ్వగా కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కానీ.. అనుహ్యంగా జడ్జి తుదితీర్పును ఏప్రిల్ 22కు వాయిదా వేశారు.
కమిషన్ నివేదికను కొట్టివేయాలని, అందులో ఉన్నవంతా అవాస్తవమన్నారు. రాజకీయకక్షలో భాగంగానే ఈ కమిషన్ ను వేశారని ఆరోపించారు. కాగా.. ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ను వేశామని ప్రభుత్వం తెలిపింది. కాగా.. వాదనల సమయంలో కేసీఆర్ తరపు అడ్వకేట్.. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని కోర్టుకు తెలిపారు. 8(B), 8(C) నోటీసులు ఇవ్వలేదని, ఎక్కడా విట్నెస్ తో క్రాస్ ఎగ్జామినేషన్ జరగలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.






