- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.. కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు దెబ్బ మీద దెబ్ తగులుతోందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు దెబ్బ మీద దెబ్ తగులుతోందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె ‘జాగృతి జనం యాత్ర’లో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలోని మక్తపల్లి గ్రామంలో తుపానుతో నష్టపోయిన పంటలను స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మొంథా తుపాను, నిరంతర వర్షాల కారణంగా రైతులు దారుణంగా నష్టపోయారని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి కొనుగోళ్లు జరగకపోవడం, వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతుండటం లాంటి సమస్యలు రైతుల జీవితాలను దయనీయంగా మారుస్తాయని కవిత అన్నారు.
తేమ శాతంపై కండిషన్లు సరికాదు..
తపానుతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని డిమాండ్ కవిత చేశారు. మక్తపల్లి కొనుగోలు కేంద్రంలో రైతులు నెల రోజులుగా ధాన్యాన్ని కుప్పలు పోసి ఉంచారని.. బుధవారం రాత్రి కురిసిన వానకు ధాన్యమంతా తడిసిపోయిందన్నారు. ధాన్యం మెులకలు వచ్చి, బూజు పట్టి, తేమ శాతం ఎక్కువగా ఉన్న ధాన్యం కూడా కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. మిల్లర్లు తేమ శాతం 17 కంటే తక్కువ ఉండాలని కండిషన్లు పెడుతున్నారని, ఈ పరిస్థితుల్లో అది సాధ్యం కాదన్నారు. ఐకేపీ సెంటర్లు లేకుండా డైరెక్ట్‌గా మిల్లర్లే ధాన్యం కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారని తెలిపారు. ఐకేపీ సెంటర్ల నుంచి మిల్లర్ల వద్దకు తీసుకెళ్లేందుకు అదనపు ఖర్చు అవుతోందని ఆరోపించారు. కొన్ని చోట్ల కౌలు రైతుల ధాన్యాన్ని భూమి పత్రాలు లేవంటూ కొనుగోలు చేయట్లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని.. ఇప్పుడు రైతులను ఇబ్బంది పెట్టటం సరికాదన్నారు. వారి ధాన్యాన్ని కొనేలా వెసులుబాటు ఇవ్వాలని, యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించాలని కవిత డిమాండ్ చేశారు.
కలెక్లర్లు, అధికారులు ఏం చేస్తున్నారు..
మొంథా తుపాను ప్రభావంతో చాలా జిల్లాల్లో వరి పంట నేలకు ఒరిగిందని.. కోయడానికి కూడా వీలు లేకుండా ఉందని కవిత తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేయకపోవడం సోచనీయమని కలెక్టర్లు, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎకరాకు ప్రభుత్వం రూ.10 వేలు పరిహారం ఇస్తానంటోందని.. అది ఏ మూలకు సరిపోదన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే బీహార్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి కూలీలెవరూ రావటం లేదన్నారు. ఇలా రాష్ట్రంలోని అన్నదాతలకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉందని కవిత కామెంట్ చేశారు.






