- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా కోసం వెళ్లి సొమ్మసిల్లి పడిపోయిన రైతు
పొద్దంతా లైన్ లో నిలబడడంతో అస్వస్థత

యూరియా కోసం వెళ్లి సొమ్మసిల్లి పడిపోయిన రైతు
- పొద్దంతా లైన్ లో నిలబడడంతో అస్వస్థత
దిశ, గంగాధర: ఈ ఏడాది రైతులకు ఎరువులు దొరకక సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో యూరియా కోసం అన్నదాతలు రోజూ సొసైటీ కార్యాలయాల వద్ద క్యూలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేకువజామున నుంచే లైన్‌లో నిలబడి, తిండి తిప్పలు మానుకొని సాయంత్రం వరకూ కష్టపడ్డా ఒక్క బస్తా కూడా అందక నిరాశతో వెనుదిరిగిపోవాల్సి వస్తోంది. నీరు, ఆహారం లేకుండా గంటల తరబడి నిలబడటం వల్ల కొంతమంది రైతులు అస్వస్థతకు గురవుతున్నారు. బుధవారం కురిక్యాల సొసైటీ వద్ద సాయిల్ల రాజమల్లు అనే రైతు ఉదయం నుంచి లైన్‌లో నిలబడటంతో అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఇతర రైతులు ఆయనను సమీపంలోని ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించాలని వైద్యులు సూచించారు. యూరియా సరఫరాలో లోపాలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేదంటే పంటలు పూర్తిగా నష్టపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.






