అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం

by Disha Web Desk 2 |
అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
X

దిశ, జగిత్యాల టౌన్: అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలోని సంతోష్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాలలో గోల్డ్ స్మిత్‌గా పనిచేస్తున్న ఆపోజీ కృష్ణమూర్తికి కొంతకాలంగా అప్పుల బాధ ఎక్కువ కావడంతో ఆదివారం తన భార్య శైలజ, కుమారుడు ఆశిత్, కుమార్తె గాయత్రిలతో పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. దీంతో నలుగురు అపస్మారక స్థితికి చేరుకోవడాన్ని స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed