మండలి బడ్జెట్ ​ప్రసంగమంతా ఇంగ్లీషులోనే..

by Naga Rani Yarlagadda |

మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ప్రసంగమంతా ఇంగ్లీషులోనే జరిగింది.

మండలి బడ్జెట్ ​ప్రసంగమంతా ఇంగ్లీషులోనే..
X
  • అధికార పార్టీ సభ్యులకే అర్ధం కానీ పరిస్థితి
  • బీఆర్​ఎస్, బీజేపీ సభ్యులు మధ్యలో అభ్యంతరాలు
  • గంటన్నర పాటు ప్రసంగించిన మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర బడ్జెట్​అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టగా, శాసన మండలిలో మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ప్రవేశ పెట్టారు. 2026–27 ఏడాదికి రూ.3,24,234 కోట్ల అంచనా వేసి, ప్రభుత్వం నూతన పథకాలు ప్రతిపాదించింది. బడుగుల బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్​గతం కంటే ఎక్కువగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. శుక్రవారం మండలిలో జరిగిన ఉత్తమ్​కుమార్​ప్రసంగమంతా ఇంగ్లీషునే సాగించింది. అదికార కాంగ్రెస్​పార్టీ సభ్యులకు అర్ధం కాక సభ నుంచి బయటకు వచ్చారు. ఆరు గ్యారంటీల అమలు అంశం ప్రస్తావన సమయంలో విపక్ష పార్టీ సభ్యలు అవాస్తవాలు చెబుతున్నారని అభ్యంతరం చెప్పారు. అమలు చేయని పథకాలు చేసినట్లు చెప్పడం సిగ్గుచేటన్నారు. గత ఏడాది బడ్జెట్​కంటే తక్కువ కేటాయింపులు చేసినట్లు బీఆర్​ఎస్, బీజీపీ సభ్యులు ఆరోపించారు. అంకెలా గారడీ, అసత్యాలతో ఉందన్నారు. విపక్ష సభ్యులు అభ్యంతర చెప్పిన మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి తన ప్రసంగం ఆగకుండా చదివారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు. రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వం విమర్శలు చేయడం మానుకోవాలని హితువు పలికారు.

Next Story