Sridhar Babu: ఒత్తిడి లేని జీవితంతోనే ఆరోగ్యం

by Gantepaka Srikanth |

రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణకు నిర్మించడమే ప్రభుత్వం లక్ష్యమని.. ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు చెప్పారు.

Sridhar Babu: ఒత్తిడి లేని జీవితంతోనే ఆరోగ్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణకు నిర్మించడమే ప్రభుత్వం లక్ష్యమని.. ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు చెప్పారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ‘రన్ ఫర్ గ్రేస్, స్క్రీన్ ఫర్ లైఫ్’ అనే థీమ్‌తో నిర్వహించిన ‘గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ ఎనిమిదో ఎడిషన్’ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్షలాది మందిని కబళిస్తున్న క్యాన్సర్‌ మహమ్మారిపై అవగాహన కల్పించాల్సిన సామాజిక బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆరోగ్యాన్ని మించిన సంపద ఏదీ లేదన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా.చినబాబు సుంకవల్లి తదితరులు పాల్గొన్నారు.

Next Story