- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పురపోరులో ఫైనల్ పంచ్!.. ప్రచారం చివరి రోజు రెచ్చిపోతున్న నేతలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ప్రధాన పార్టీల నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు, కౌంటర్లతో రాజకీయ వేడి పెంచుతున్నారు

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు (Telangana Municipal Elections) కీలక దశకు చేరుకున్నాయి. మరికొన్ని గంటల్లో ప్రచార పర్వానికి (Campaign) బ్రేకులు పడనున్నాయి. నేతల ప్రసంగాలతో చెవుల్లో హోరెత్తించిన మైకులు ఇక మూగబోనున్నాయి. అయితే ప్రచారానికి ఆఖరు రోజు ప్రధాన పార్టీలలోని ముఖ్యనేతలు ఓటర్లను తమవైపు ఆకర్షించేలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్యాంపెయిన్ ముగియడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో పార్టీల అగ్రనేతలు ప్రత్యర్థులపైకి తమ అస్త్రశస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. తిట్లు, కౌంటర్లు, సెంటిమెంట్లతో సాగుతున్న చివరి రోజు ప్రచారంలో లాస్ట్ పంచ్ ఎవరిది కాబోతోంది? ఓటర్లు ఎవరి ప్రచారానికి పట్టం కట్టబోతున్నారు? ఎవరి మాటలను అటకెక్కించబోతున్నారు అనేది ఉత్కంఠ రేపుతోంది.
డోస్ పెంచిన నేతలు:
ప్రచారానికి చివరి రోజు కావడంతో సోమవారం నేతలు తమ విమర్శలకు మరింత పదును పెట్టారు. నిన్నా మొన్నటి వరకు ఓ లెక్క ఇవాళ మరో లెక్క అన్నట్లు డబుల్ డోస్‍తో మాటల ఫిరంగులు పేల్చారు. కామెంట్స్, కౌంటర్లతో రెచ్చిపోయారు. ముఖ్యంగా భూపాలపల్లిలో ప్రచారం నిర్వహించిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను తిట్టినోళ్లు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టబోమన్నారు. భూపాలపల్లి జిల్లాను తాము తీసేయమని రేవంత్ రెడ్డి అంటున్నారని ‘ఈ జిల్లాను తీసెయడానికి ఇది నువ్వు పెట్టినవారా?’ అంటూ పరుష పదాలు ప్రయోగించారు. ఇక రామయంపేటలో మాట్లాడిన మాజీ మంత్రి హరీశ్ రావు.. కొంత మంది పోలీసులు అతి చేస్తున్నారని రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వస్తుంది నేనే మంత్రిగా ఉంటా.. ఎక్స్‌ట్రాలు చేస్తే ఒక్కొక్కడి నట్లు, బోల్టులు ఫిట్ చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక సీఎంను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సైతం అంతే ఘాటుగా రియాక్ట్ అయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ స్పందిస్తూ.. అసలు ఆ వెధవ ఏం చదువుకున్నాడో అర్థం కావడం లేదంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మేము తిట్టుటు మొదలు పెడితే నువ్వు ఆత్మహత్య చేసుకుంటావంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ నేత సామరామ్మోహన్ రెడ్డి స్పందిస్తూ కేటీఆర్ పొడువు ఉండి ఏం పీకా* నువ్వు అంటూ ఫైర్ అయ్యారు. ఇక ఎంఐఎంతో వంద కోట్ల డీల్ కుదుర్చుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ ఈ వంద కోట్ల ఆరోపణలపై ఆధారాలు చూపాలని లేదంటే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక దుబ్బాకలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ దుబ్బాక అభివృద్ధికి హరీశ్ రావు ప్రధాన అడ్డంకి అని హరీశ్ రావును దుబ్బాకకు రాకుండా ఆయన ఎక్కడికి వచ్చినా చాటలు చీపుర్లు పట్టుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక నా జీవితంలో ఎన్నో కష్టాలు పడి వచ్చానంటూ నేను పాలిచ్చే ఆవులాంటి వాడ్నంటూ సదాశివపేటలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సెంటిమెంట్ రైజ్ చేశారు.
సీఎం ప్రెస్ మీట్ పై ఉత్కంఠ:
ఇదిలా ఉంటే ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన మాట్లాడబోతున్నారు. ప్రచార పర్వం ముగియడానికి ముందు సీఎం మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతుండటంతో ఆయన ఏం మాట్లాడబోతున్నారు? బీఆర్ఎస్, బీజేపీలకు ఎలాంటి కౌంటర్లు ఇస్తారు అనేది ఉత్కంఠగా మారింది. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎవరిది పై చేయి కాబోతోంది మరెవరికి మొండి చేయి మిగలబోతోంది అనేది ఈ నెల 13తో తేలిపోనుంది.






