cobra snake : నాగు పామును చీల్చి చెండాడిన కుక్కలు

by Y. Venkata Narasimha Reddy |
cobra snake : నాగు పామును చీల్చి చెండాడిన కుక్కలు
X

దిశ, వెబ్ డెస్క్ : సహజంగా కుక్కలు(dogs) పాము(snake) ల వేటకు దూరంగా ఉంటాయి. అడపదడపా పరస్పరం ఎదురుపడినా బెదిరింపులు, అరుపులకే కుక్కలు పరిమితమై పాములను తరుమడం చూస్తుంటాం. అయితే ఓ భారీ నాగు పామును పెంపుడు కుక్కలు చీల్చి చెండాడిన ఘటన వైరల్ గా మారింది. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ నాగు పామును వ్యవసాయ క్షేత్రంలో సంచరించడాన్ని చూసిన రెండు డాబర్మాన్ జాతీ పెంపుడు కుక్కలు గట్టిగా అరిచి యజమానికి అలర్ట్ చేశాయి.

కుక్కల అరుపులు విని అటుగా వచ్చిన యజమాని పామును గమనించి కర్ర తెచ్చుకుందామని వెళ్ళాడు. యజమాని వచ్చేలోపునే ఆ కుక్కలు నాగు పాముపై దాడి చేసి దానిని చీల్చివేశాయి. పాము కాటుకు గురికాకుండా దానిని ఆ కుక్కలు హతమార్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Advertisement

Next Story