- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వన మహోత్సవంలో శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలను వెంటనే పూర్తి చేయాలి
వన మహోత్సవంలో శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ నదీమ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు.

- మొదటి స్థానంలో పంచాయతీ రాజ్ శాఖ
- ఇప్పటి వరకు నాటిన జిల్లాల్లో జనగామా 91.93 శాతం పూర్తి
- అధికారులను ఆదేశించిన అటవీ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ నదీమ్ అహ్మద్
దిశ, తెలంగాణ బ్యూరో: వనమహోత్సవంలో శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ నదీమ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. గురువారం డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో PCCF (Hoff) సువర్ణతో కలిసి వనమహోత్సవం రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ, సమన్వయ కమిటీ (State level monitoring and coordination committe) సమావేశం నిర్వహించారు. HMDA, GHMC, PR&RD, వ్యవసాయ, పశువర్ధక శాఖ, విద్యా శాఖ, ఎక్సైజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.. మొదట శాఖల వారీగా నాటిన మొక్కల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యధికంగా పంచాయతీ రాజ్ శాఖ 81 శాతం మొక్కలు నాటింది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు చేపట్టిన చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో కార్యదర్శులు గ్రామ పరిధిలో ప్లాంటేషన్ పనులు చేపట్టడం తో పాటుగా గ్రామాల్లో ప్రతి ఇంటికి మొక్కలు డిస్ట్రిబ్యూషన్ చేశామని, ఆ వివరాలను గ్రామ స్థాయిలో కార్యదర్శులు రికార్డుల్లో కూడా నమోదు చేశారని PR & RD అధికారులు తెలిపారు. HMDA టార్గెట్ చేరడంలో కొంత వెనుకంజలో ఉందని, సాధ్యమైనంత త్వరగా లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు.
పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ మాట్లాడుతూ జిల్లాల వారీగా ఇచ్చిన టార్గెట్లను వెంటనే పూర్తి చేయాలని, పూర్తి చేసిన వివరాల డేటాను ఆన్ లైన్ లో అప్లోడ్ చేయాలని సూచించారు. అలాగే నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని, వర్షాలు పడని సమయంలో వాటరింగ్ కూడా చేపట్టాలన్నారు. బ్లాక్ ప్లాంటేషన్ లో భాగంగా ఈత మొక్కలను ఎక్కువగా పెంచాలని, హైబ్రిడ్ ఈత మొక్కలను నాటడంపై దృష్టి సారించాలని ఎక్సైస్ అధికారులకు సూచించారు. వనమహోత్సవ కార్యక్రమంలో పిల్లల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూడాలన్నారు. HMDA మినహాయించి మిగతా శాఖలు అన్ని ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 30 లోపు 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ప్లాంటేషన్ పూర్తయిన చోట మొక్కలకు జియో ట్యాగింగ్ చేయాలన్నారు.
వన మహోత్సవంలో మొక్కలు నాటిన టాప్ ఐదు జిల్లాలు
రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవం కార్యక్రమంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటిన టాప్ ఐదు జిల్లాలను అధికారులు గుర్తించారు. జనగాం 91.93 శాతం, కామారెడ్డి 80.82 శాతం, జోగులాంబ గద్వాల్ 78.70 శాతం, రాజన్న సిరిసిల్ల 75.03 శాతం, భద్రాద్రి కొత్తగూడెం 71.84 శాతం మొక్కలు నాటి మొదటి ఐదు వరుసల్లో ఉన్నాయి.






