ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం ఆయనదే.. మంత్రి శ్రీధర్‌బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-11 07:53:40  IST  )

బీఆర్ఎస్ (BRS) పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌ (Congress)లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్‌దే తుది నిర్ణయమని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు.

ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం ఆయనదే.. మంత్రి శ్రీధర్‌బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ (BRS) పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌ (Congress)లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్‌దే తుది నిర్ణయమని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు. ఇవాళ ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించి ఎమ్మెల్యే అనర్హతపై స్పీకర్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం 3 నెలల సమయం ఇచ్చిందని తెలిపారు. అనర్హత విషయంలో ప్రభుత్వ ప్రమేయం ఏ మాత్రం ఉండదని కామెంట్ చేశారు.

కాళేశ్వరం అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ (Justice Chandra Ghosh Commission) ప్రభుత్వానికి తుది నివేదకను అందజేసిందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బ్రీఫ్ కమిటీ ఆ నివేదికపై క్షుణ్ణంగా స్టడీ చేసి షార్ట్ రిపోర్టును తయారు చేసిందని, అందులోని కీలక విషయాలను ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని తెలిపారు. త్వరలోనే కాళేశ్వరం (Kaleshwaram) నివేదికను త్వరలోనే అసెంబ్లీలో పెడతామని, బీఆర్ఎస్ పార్టీతో సహా అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. అందరి సభ్యుల అభిప్రాయాల మేరకు కాళేశ్వరం నివేదికపై ఎన్‌డీఎస్‌ఏ (NDSA) నివేదిక ఆధారంగా ముందుకెళ్తామని తెలిపారు. భవిష్యత్తులో మేడిగడ్డ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రయత్నిస్తామని అన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తన పని తాను చేసుకుపోతోందని, కేసులో విచారణకు పిలవడంపై సిట్‌ (SIT)దే తుది నిర్ణయమని పేర్కొన్నారు. బీసీలకు అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని.. ఎట్టి పరిస్థితుల్లో 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

Next Story