జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి బాధాకరం: కేంద్ర మంత్రి బండి

by Malleboina Mahesh |   (  Updated:2025-06-08 03:59:11  IST  )

ఆదివారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అస్వస్థతతో మరణించారు.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి బాధాకరం: కేంద్ర మంత్రి బండి
X

దిశ, వెబ్ డెస్క్: ఆదివారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే (Jubilee Hills MLA,), బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) అస్వస్థతతో మరణించారు. కాగా ఆయన మరణంతో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలను షాక్ కు గురిచేసింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 5న గుండెపోటు కారణంగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి (Gachibowli AIG Hospital)లో చేరారు. దాదాపు మూడు రోజుల నుంచి వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తుండగా ఈ రోజు తెల్లవారుజామున 5.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా ఆయన మృతిపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల సంతాపం తెలుపుతున్నారు.

ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. "జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి బాధాకరం. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందిస్తున్న నాయకుడి మరణం ప్రజలకు తీరని లోటు. ఎమ్మెల్యే ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను." అని రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే మరణ వార్తలు వినగానే.. హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ఉదయం 8. 30 గంటలకు ఏఐజీ ఆస్పత్రి నుంచి ఎమ్మెల్యే గోపీనాథ్ మృతదేహాన్ని మాదాపూర్ లోని తన నివాసానికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు.

Next Story