- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మృతి చెందడం బాధకరం: మేయర్ విజయలక్ష్మి
by Satheesh |
హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి సికింద్రాబాద్‌లోని కళాసిగూడలో పర్యటిస్తున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి సికింద్రాబాద్‌లోని కళాసిగూడలో పర్యటిస్తున్నారు. భారీ వర్షం కారణంగా ఇవాళ ఉదయం సికింద్రాబాద్‌లోని కళాసిగూడలో నాలాలో పడి ఓ బాలిక మృతి చెందిన స్పాట్‌కు మేయర్ విజయలక్ష్మి వెళ్లారు. స్థానిక అధికారుల తీరుపై మేయర్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. మ్యాన్‌హోల్‌లో పడి బాలిక మృతి చెందడం బాధకరమని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్ల మరమ్మత్తులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. తవ్విన వెంటనే రోడ్డు మరమ్మత్తులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పైప్ లైన్స్ వేయాల్సి ఉన్నందున రెండు రోజులు ఆగమని వాటర్ డిపార్ట్ మెంట్ అధికారు కోరారని మేయర్ తెలిపారు.
Next Story






