దందాలు నా ఇలాకాలో చెల్లవు.. మంత్రి గడ్డం వివేక్ మాస్ వార్నింగ్

by Kema Shiva Kumar |

తన ఇలాకాలో దందాలు, ఇల్లీగల్ బిజినెస్‌లు ఇక చెల్లవని అక్రమార్కులకు మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి (Minister Vivek Venkata Swamy) మాస్ వార్నింగ్ ఇచ్చారు.

దందాలు నా ఇలాకాలో చెల్లవు.. మంత్రి గడ్డం వివేక్ మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: తన ఇలాకాలో దందాలు, ఇల్లీగల్ బిజినెస్‌లు ఇక చెల్లవని అక్రమార్కులకు మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి (Minister Vivek Venkata Swamy) మాస్ వార్నింగ్ ఇచ్చారు. సిద్దిపేట (Siddipet) ఇంచార్జ్ మంత్రిగా నియమితులైన ఆయన ఇవాళ మొదటిసారి నియోజవర్గానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ (Congress) పార్టీ నాయకులు, శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. ప్రజలతో ప్రతి కార్యకర్త ఇంటరాక్ట్ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు. అదేవిధంగా తన సొంత చెన్నూరు నియోజకవర్గంలో అంతా ఇసుక దందాలు బంద్ చేయాలని మాస్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రిగా మైనింగ్‌, కార్మిక శాఖకు న్యాయం చేస్తానని అన్నారు. ఎలాంటి అక్రమాలు జరిగినా.. పోలీసులు హుటాహుటిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ నిజాయితీగా పని చేయాలని.. ప్రజలకు సేవకులుగా ఉందామని మంత్రి వివేక్ పిలుపునిచ్చారు.

Next Story