TG EAPCET-2026కు ఏప్రిల్ 4 వరకు గడువు..

by Kema Shiva Kumar |

తెలంగాణ టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) 2026 దరఖాస్తుకు ఏప్రిల్ 4 వరకు గడువు ఉంది.

TG EAPCET-2026కు ఏప్రిల్ 4 వరకు గడువు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) - 2026 పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని కన్వీనర్ డాక్టర్ కె. విజయకుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈఏపీసెట్ పరీక్షలు మే నెలలో జరగనున్నాయి. సోమవారం వరకు ఇంజనీరింగ్ విభాగంలో 1,84,027, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 76,162, రెండింటికీ కలిపి మొత్తం 238 దరఖాస్తులు వచ్చాయి. కాగా అన్ని విభాగాల్లో మొత్తం 2,60,427 దరఖాస్తులు వచ్చినట్లు కన్వీనర్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోలేని వారు ఏప్రిల్ 10 లోపు రూ.250తో, ఏప్రిల్ 15 లోపు రూ. 500, 20వ తేదీ లోపు రూ. 2,500, ఏప్రిల్ 24లోపు రూ. 5 వేలు, మే 2 వరకు రూ. 5 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, ఏప్రిల్ 4లోపే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం www.eapcet.tgche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని తెలిపారు.

Next Story