- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో ముగిసిన కీలక ఘట్టం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. ఇవాళ సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. రాష్ట్రమంతటా 144 సెక్షన్‌తో పాటు సైలెన్స్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. ఇవాళ సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. రాష్ట్రమంతటా 144 సెక్షన్‌తో పాటు సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో స్థానికేతరులు నియోజకవర్గాలు విడిచి వెళ్లాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 30న జరగనుండటంతో ఎన్నికల సంఘం నిబంధనల్లో భాగంగా 24 గంటల ముందే ప్రచారం ముగియనుంది. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం ఐదు గంటల తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పర్వం ముగిసింది. కాగా, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అక్టోబర్ 9వ తేదీ నుండి దాదాపు రెండు నెలల పాటు రాష్ట్రంలో రాజకీయ నేతలు ప్రచారం హోరెత్తించారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు.
హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపు 95 బహిరంగ సభల్లో పాల్గొనగా.. గులాబీ పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించారు. మరో పక్కా బీఆర్ఎస్‌ను గద్దె దింపడమే టార్గెట్‌గా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రచారం హోరెత్తించింది. కర్నాటక ఎన్నికల రిజల్ట్ తర్వాత గ్రాఫ్ అమాంతం పెరగడంతో.. తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు నూతనోత్సహంతో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, ఖర్గే, డీకే, సిద్ధారామయ్య వంటి నేతలు తెలంగాణలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారం చేశారు. మరో పక్కా బీజేపీ సైతం చివర్లో ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించింది. ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా, యోగి వంటి కీలక నేతలు తెలంగాణలో ప్రచారం చేశారు. మూడు పార్టీల నేతల ప్రచారంతో దాదాపు రెండు నెలల పాటు హోరెత్తిన తెలంగాణ.. ఇవాళ సాయంత్రం నుండి మూగబోనుంది. ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ మూడవ తేదీన కౌంటింగ్, ఫలితాలు వెలువడునున్నాయి.






