- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటితో ముగియనున్న దోస్త్ తుది గడువు
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు కోసం నిర్వహించే దోస్త్ (DOST) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నేటితో (ఆగస్టు 2) ముగియనుంది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు కోసం నిర్వహించే దోస్త్ (DOST) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నేటితో (ఆగస్టు 2) ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీల్లో కలిపి మొత్తం 4.36 లక్షల సీట్లు ఉన్నాయి. మూడు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ తర్వాత.. దాదాపు 2 లక్షలకుపైగా సీట్లు భర్తీ కానట్లు అధికారికి వర్గాల మేరకు తెలిసింది. ఈ నేపథ్యంలో స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లను ప్రకటించారు. ఈ స్పెషల్ ఫేజ్ గడువు జులై 31తో ముగియనుండగా, ఆగస్టు 2 వరకు పొడగించారు. ఇక మరోసారి పొడగించే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఈ ఫేజ్‌కి సంబంధించిన సీట్ల కేటాయింపు ఆగస్టు 6వ తేదీన ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ లో పాల్గొనేందుకు విద్యార్థులు రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్లలో భాగంగా సీట్లు పొందే వారికి స్కాలర్ షిప్స్ అవకాశం ఉండదని అధికారులు ప్రకటించారు.
రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి:
* దోస్త్ అధికారికి వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/ ఓపెన్ చేయాలి.
* హోం పేజీలో క్యాడెంట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
* ఆ తర్వాత మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, పుట్టినతేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
* చివరల్లో ఆధార్ అథంటికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
* ఇప్పుడు దోస్త్ ఐడీ జనరేట్ అవుతుంది.
* దీని ద్వారా లాగిన్ అవ్వాలి.
* మీరు ఎంటర్ చేసిన లాగిన్ వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
* ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి.






