- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాక్షసత్వం రాజ్యమేలిన రోజు.. 50 ఏళ్ల ‘ఎమర్జెన్సీ’పై బండి సంజయ్ హాట్ ట్వీట్
దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) 1975లో సరిగ్గా ఇదే రోజున దేశంలో ఎమర్జెన్సీ (Emergency) విధించింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) 1975లో సరిగ్గా ఇదే రోజున దేశంలో ఎమర్జెన్సీ (Emergency) విధించింది. అయితే, నేటితో ఆ 21 నెలల చీకటి రోజులకు 50 ఏళ్లు నిండాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో మీడియా గొంతు నొక్కుతూ.. ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులను అనే తేడా లేకుండా అందరిని జైళ్లలోకి నిర్ధాక్షిణ్యంగా నెట్టిన పాపమది. ఈ నేపథ్యంలోనే దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్ల పూర్తి అయిన సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన ట్వీట్ చేశారు.
ప్రజాస్వామ్యానికి పాతరేసి.. రాక్షసత్వం రాజ్యమేలిన రోజు.. 50 ఏళ్ల ‘ఎమర్జెన్సీ’పై బండి సంజయ్ ఫైర్నియంతృత్వం రాజ్యమేలిన రోజని కామెంట్ చేశారు. దేశమంతా అధికార దాహమనే చీకటితో నిండిన రోజని ఫైర్ అయ్యారు. స్వాతంత్ర్యాన్ని కాలరాసి, రాక్షసత్వం రాజ్యమేలిన రోజు, వ్యక్తి స్వేచ్ఛకు సమాధి కట్టి రాజ్యాంగాన్ని పరిహసించిన రోజని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ విధించిన ‘ఎమర్జెన్సీ’ (Emergency) భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిల్చిన దుర్దినమని అభివర్ణించారు. ఎమర్జెన్సీనీ ఎత్తివేసేందుకు పాటుపడి, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు జైళ్లలో మగ్గిన ఎందరో మహనీయుల సేవలను స్మరించుకుంటూ రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడదామని బండి సంజయ్ ట్వీట్ చేశారు.






