- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
43 ఏళ్ల అజ్ఞాత జీవితానికి నేటితో తెర.. జనజీవన స్రవంతిలోకి సుజాతక్క
43 ఏళ్ల అజ్ఞాత జీవితానికి తెన పడింది. సీపీఐ (మావోయిస్టు) పార్టీ సీనియర్ లీడర్, కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి అలియాస్ కల్పన అలియాస్ మైనక్క తెలంగాణ డీజీపీ జితేందర్ ఎదుట జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.

దిశ, డైనమిక్ బ్యూరో: 43 ఏళ్ల అజ్ఞాత జీవితానికి తెర పడింది. సీపీఐ (మావోయిస్టు) పార్టీ సీనియర్ లీడర్, కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి అలియాస్ కల్పన అలియాస్ మైనక్క తెలంగాణ డీజీపీ జితేందర్ ఎదుట జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. 62 ఏళ్ల సుజాత స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని పెంచికల్పాడు గ్రామం. ఆమె సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలిగా (CCM), దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) సెక్రటేరియట్ మెంబర్‌గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) పరిధిలోని దక్షిణ సబ్ జోనల్ బ్యూరో సెక్రటరీగా, జనతన్ సర్కార్ (రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీ) బాధ్యురాలిగా పలు హోదాల్లో పని చేశారు. పార్టీ బాధ్యతలతో పాటుగా కోయ భాషలో వచ్చే ‘పేతురి’ అనే పత్రికకు సంపాదకురాలిగా కూడా పని చేశారు. అయితే, ఆ పత్రిక ప్రతి సంవత్సరం మూడు సార్లు దక్షిణ సబ్ జోనల్ బ్యూరో ప్రాంతంలో ప్రచురించబడేది.
ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలనే..
పోతుల పద్మావతి ఆరోగ్యం ఇటీల క్షీణించడంతో 2025 మే నెలలో సీపీఐ (మావోయిస్టు) పార్టీ నుంచి బయటకు వచ్చారు. తన నిర్ణయాన్ని పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, CCM ద్వారా కేంద్ర ప్రభుత్వ సహాయంతో జన జీవన స్రవంతిలో తిరిగి కలవాలని నిర్ణయించుకున్నట్లుగా కమిటీకి తెలిపారు. దశాబ్దాల పాటు అజ్ఞాత జీవితం గడిపి ప్రస్తుతం తన ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఆమె ఉద్యమం నుంచి బయటకు వచ్చినట్లుగా తెలిపారు. ఇకపై ఆమె సాధారణ జీవితాన్ని గడపాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలను సద్వినియోగపరుచుకుని తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబంతో ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
రూ.25 లక్షల నగదు బహుమతి..
పోతుల పద్మావతి అలియాస్ సుజాతక్క జనజీవన స్రవంతిలో కలుస్తున్న నేపథ్యంలో ఆమెపై ఉన్న రూ.25 లక్షల నగదు బహుమతిని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో సుజాతక్కకు డీజీపీ జితేందర్ అందజేశారు. అదనంగా, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకానికి అనుగుణంగా లొంగిపోయిన కేడర్లకు లభించే అన్ని ఇతర ప్రయోజనాలు కూడా ఆమెకు అందజేయనున్నారు. 43 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితంలో ఉన్న సీనియర్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు (CCM) పొతుల పద్మావతి జనజీవన స్రవంతిలోకి తిరిగి రావడం మావోయిస్టు ఉద్యమంపై తెలంగాణ పోలీసు అవలంభించిన సమగ్ర వ్యూహంలో ఓ నైతిక విజయమని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు.
కేవలం ఒక్క 2025 సంవత్సరంలోనే మొత్తం 404 మంది మావోయిస్టులు లొంగియారని అందులో UG కేడర్ చెందిన నలుగురు రాష్ట్ర కమిటీ సభ్యులు (SCMs), డివిజనల్ కమిటీ కార్యదర్శి ఒకరు (DVCS), ఎనమిది మంది డివిజనల్ కమిటీ సభ్యులు (DVCM), 34 మంది ఏరియా కమిటీ సభ్యులు (ACMs) సాయుధ పోరాటాన్ని వీడి తమ, తమ కుటుంబాలతో కలిసి శాంతియుత జీవితం గడపాలని నిర్ణయించుకొని తెలంగాణ పోలీసులు ముందు లొంగిపోయారని తెలిపారు. ప్రస్తుతం సీపీఐ (మావోయిస్టు) పార్టీలో 78 మంది అజ్ఞాత మావోయిస్టు కేడర్లలో తెలంగాణ రాష్ట్రానికి చెందినవారే ఉన్నారని తెలిపారు. మొత్తం 15 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో 10 మంది తెలంగాణకు చెందిన వారేరని వెల్లడించారు.
‘పోరు వద్దు.. ఊరు ముద్దు’
తెలంగాణ రాష్ట్రానికి చెందిన అజ్ఞాత మావోయిస్టులు అంతా తమ స్వగ్రామలకు తిరిగి వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ జితేందర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మాజీ మావోయిస్టులు వంతు సానుకూల పాత్ర పోషించాలన్నారు. తెలంగాణ పోలీసులు ఇస్తున్న ‘పోరు వద్దు.. ఊరు ముద్దు’ నినాదం సత్పలితాలను ఇస్తుందని.. అజ్ఞాత మావోయిస్టులు లొంగిపోతే ప్రభుతవం తరఫున వారికి తక్షణమే తగిన ఆర్థిక సాయంతో పాటు స్వతంత్రంగా, గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన సాయం, పునరావాసం ఇతర ప్రజయోజనాలు కల్పిస్తామని డీజీపీ జితేందర్ అన్నారు.






