- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో కైట్ ఫెస్టివల్.. అధికారులకు సీఎస్ కీలక ఆదేశాలు
హైదరాబాద్ సాంస్కృతిక వైభవం ప్రతిబింబించేలా కైట్ ఫెస్టివల్‌ను నిర్వహించాలని అధికారులకు సీఎస్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ సాంస్కృతిక వైభవం ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించాలని అధికారులను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. నగరంలో కైట్ ఫెస్టివల్ నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ జనవరి 13 నుంచి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఫెస్టివల్ సమయంలో ఎలాంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుసుకుండా చూడాలన్నారు. నగరంలో ప్రజలు నిర్వహించే ‘కైట్ ఫెస్టివల్స్’ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు.
కాగా సంక్రాంతి సీజన్(Sankranti)లో హైదరాబాద్(Hyderabad)లో కైట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించడం అనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ తో పాటు నగరంలో వివిధ చోట్ల ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్‌లోవిదేశీయులు సైతం పాల్గొంటారు. వివిధ రూపాల్లో ఉన్న కైట్స్‌ను ఎగురవేసి సందడి చేస్తారు. ఇక హైదరాబాదీలయితే కైట్ ఫెస్టివల్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తారు. డీజే శబ్దాలతో శిబిరాలు ఏర్పాటు సంక్రాంతి మూడు రోజుల పాటు రంగు రంగుల గాలి పటాలను ఎగరవేసి కేరింతలు కొడతారు. జనవరి 13 నుంచి కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఈ సారి కూడా దుమ్మరేపేందుకు ఇప్పటి నుంచే నగర వాసులు సిద్ధమవుతున్నారు.






