వెయ్యేళ్ల చిలుకూరు శివాలయాన్ని పదిలపర్చాలి..

by Disha Web Desk 20 |
వెయ్యేళ్ల చిలుకూరు శివాలయాన్ని పదిలపర్చాలి..
X

దిశ, వెబ్‌డెస్క్ : చిలుకూరులో వీసా లిప్పించే బాలాజి దేవాలయంతోపాటు రాష్ట్రకూటుల కాలంలో నిర్మించిన శిథిలమవుతున్న శివాలయం కూడా ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. వారసత్వ సంపదను కాపాడ- టానికి గ్రామస్థులకు అవగాహన కల్పించే ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ సొసైటీ కార్యక్రమంలో భాగంగా, శనివారం నాడు, ఆయన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం, చిలుకూరు గ్రామ పరిసరాల్లో అనేక చారిత్రక ఆనవాళ్లతో పాటు ఆలయం నడిబొడ్డున, పగుళ్లు బారుతున్న రాష్ట్రకూటుల శైలిలో నిర్మించిన వెయ్యేళ్ల నాటి శివాలయాన్ని పరిశీలించి అసక్తి కరమైన చారిత్రక వివరాలను వెల్లడించారు.

అద్భుత వాస్తుశిల్ప నైపుణ్యంతో నిర్మించిన ఈ ఆలయ అధిష్టానం పూర్తిగా భూమిలో కూరుకుపోయిందని, గోడలు విచ్చుకుపోతున్నాయని, శిఖరం రాళ్ళు కూలిపోతున్నా యనీ క్రీ.శ. 9, 10 శతాబ్దాల నాటి ఈ ఆలయాన్ని ఊడదీసి, ఎత్తైన పీఠంపై ఆధునిక పునాదులపై పునరుద్ధరించి, గతవైభవ ప్రాభవాలను తీసుకురావాలని ఆయన గ్రామస్థులను కోరారు.

గ్రామంలో పోచమ్మ గుడి వద్దగల భైరవ, నాగదేవతలు, వీరుల శిల్పాలు, వీరభద్ర, భక్తురాళ్ల శిల్పాలు, అలయంపైన వేసిన రంగుల్ని తొలగించి, ఫీఠాలను నిలబెట్టాలని, చెరువు కట్ట మండపాన్ని పునరుద్ధరించి, చిలుకూరు బాలాజీ భక్తులు కూడ శివాలయాన్ని సందర్శించేలా ఒక పేరు పలకను రహదారిపై ఏర్పాటు చేయాలని చిలుకూరు గ్రామస్థులకు ఈమని శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

వేములవాడ చాళుక్యుల కాలరంలో చిలుకూరు ఒక జైన బసదిగా విలసిల్లిందని గ్రామానికి చెందినే జైన తీర్ధంకర శిల్పాలను గోల్కొండలోని ఖజానా భవంతి మ్యూజియంలో భద్ర పరిచారని ఆయన అన్నారు.


Next Story

Most Viewed