- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుడే షురూ అయింది.. మేడారానికి పోటెత్తిన భక్తజనం
ములుగు జిల్లా మేడారంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. సంక్రాంతి సెలవులు కావడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు మేడారానికి తరలివస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో : ములుగు జిల్లా మేడారంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. సంక్రాంతి సెలవులు కావడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. దీంతో సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం భక్తుల సందడితో కిటకిటలాడుతోంది. వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. మేడారం వైపు వేలాది వాహనాలు రావడంతో పస్ర-మేడారం మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
నార్లపూర్, కొత్తూరు, జంపన్నవాగు ప్రాంతాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, వైద్య శిబిరాలు, భద్రతా ఏర్పాట్లను అధికారులు పటిష్టం చేశారు. ఈ రోజు సుమారు రెండు లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో మేడారం పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనున్న విషయం తెలిసిందే.
READ MORE .....






