- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడారం జంపన్న వాగు వద్ద పాప మిస్సింగ్.. సురక్షితంగా చేరదీసిన మంత్రి సీతక్క
ములుగు జిల్లా మేడారంలోని జంపన్న వాగు వద్ద ఓ చిన్నారి తప్పిపోయిన ఘటన కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ములుగు జిల్లా మేడారంలోని జంపన్న వాగు వద్ద ఓ చిన్నారి తప్పిపోయిన ఘటన కలకలం రేపింది. అయితే వెంటనే స్పందించిన రాష్ట్ర మంత్రి సీతక్క పాపను సురక్షితంగా గుర్తించి పోలీస్ కమాండ్ కంట్రోల్‌కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, పాప పూర్తిగా సురక్షితంగా ఉందని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పోలీస్ కమాండ్ కంట్రోల్‌కు వచ్చి తమ పాపను తీసుకెళ్లాలని ఆమె సూచించారు. అయితే, మేడారం జాతర ఏర్పాట్ల సందర్భంగా మంత్రి సీతక్క అక్కడ పర్యటించారు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సమయంలో చిన్నారి మిస్సింగ్ ఘటన చోటు చేసుకుంది. మంత్రి సీతక్క స్వయంగా ఆ తప్పిపోయిన చిన్నారిని ఎత్తుకొని పోలీసులకు అప్పగించారు.
మేడారానికి పెద్ద ఎత్తున భక్తులు..
ఇదిలా ఉండగా సంక్రాంతి సెలవులు కావడంతో మేడారానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం భక్తుల సందడితో కిటకిటలాడుతోంది. వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. భారీ రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. పిల్లలు తప్పిపోకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
READ MORE .....






