- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివాదాస్పదంగా ఆ టీచింగ్ స్టాఫ్ తంతు.. ఏళ్లుగా అక్కడే తిష్ట
ఎస్సీ గురుకుల విద్యాసంస్థలకు చెందిన టీచింగ్ స్టాఫ్ హైదరాబాద్ లో తిష్ట వేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సీ గురుకుల విద్యాసంస్థలకు చెందిన టీచింగ్ స్టాఫ్ హైదరాబాద్ లో తిష్ట వేసింది. మాసబ్ ట్యాంక్ లోని డీసీసీ భవన్‌లో ఉన్న హెడ్ ఆఫీసులోని వర్క్‌కే ఇంపార్టెన్స్ ఇస్తున్నది. డిప్యుటేషన్ పై అడ్మినిస్ట్రేషన్ విధులు నిర్వహిస్తున్నది. ఇందులో వివిధ సబ్జెక్టుల నిపుణులు కూడా ఉండటం గమనార్హం. మరోవైపు ఎస్సీ గురుకులాల్లో బోధనా సిబ్బంది కొరత ఉన్నది. కాంట్రాక్ట్ స్టాఫ్ ను నియమించి బోధించాల్సి వస్తున్నది. దీంతో అడ్మినిస్ట్రేషన్ లో టీచింగ్ స్టాఫ్ విధుల నిర్వహణ పట్ల విమర్శలు వస్తున్నాయి.
ఏళ్లుగా ఒకేచోట తిష్ట
‘కొన్నేండ్లుగా ఆఫీసులోనే వర్క్ చేస్తున్నాం. జాబ్ సుకూన్ గా ఉంది. ఇక్కడే పని చేస్తాం’ అని హెడ్ ఆఫీసులో తిష్ట వేసిన టీచింగ్ స్టాఫ్ చెబుతున్నారు. ఇక్కడి నుంచి బయటకు వెళ్తే జీవితం హడావిడిగా గడపాల్సి వస్తుందని, ఏమైనా ఇక్కడి నుంచి వెళ్లేది లేదని చెబుతుండడం గమనార్హం. సదరు టీచింగ్ స్టాఫ్ ఇక్కడి నుంచి రిలీవ్ చేస్తే.. ఎవరి ద్వారానో పైరవీ చేసుకొని మళ్లీ హెడ్ ఆఫీసుకే వచ్చేస్తున్నారు. అయితే ఇలాంటి స్టాఫ్ పై ఇటీవల ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. హెడ్ ఆఫీసు నుంచి వెళ్లేందుకు ఎందుకు ఆసక్తి చూపడం లేదని వివరాలు సేకరించినట్లు సమాచారం.
కాంట్రాక్ట్ పద్ధతిపై బోధకుల నియామకం
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో 268 ఇనిస్టిట్యూషన్స్ కొనసాగుతున్నాయి. ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు లక్షలాది విద్యార్థులు గురుకుల రెసిడెన్షియల్స్ హాస్టళ్లలో చదువుతున్నారు. విద్యార్థులకు చదువుతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం భారీగా నిధులను వెచ్చిస్తున్నది. పదో తరగతి, ఇంటర్, ఆ పై చదువులకు సంబంధించి ప్రభుత్వం సబ్జెక్టు పరిజ్ఞానం ఉన్న బోధకులను నియమించింది. వీరికి పెద్ద ఎత్తున జీతాలు చెల్లిస్తున్నది. అయితే.. వీరితోపాటే సమానంగా వేతనాలు అందుకుంటున్న టీచింగ్ స్టాఫ్ లో కొందరు రెసిడెన్షియల్స్లో విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా.. డిప్యుటేషన్ పేరుతో హెడ్ ఆఫీసు బాట పడుతున్నారు. అడ్మినిస్ర్టేషన్ లో డ్యూటీలు నిర్వర్తిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో గురుకుల సొసైటీ గత్యంతం లేక కాంట్రాక్టు ప్రాతిపదికన బోధన ఉపాధ్యాయులను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల విద్యార్థులు సైతం ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి ప్రధాన కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ లో నాన్ టీచింగ్ సిబ్బంది ఉంటే బాగుంటుందనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. కానీ టీచింగ్ స్టాఫ్ ఇక్కడ పని చేయడం వల్ల క్షేత్రస్థాయిలో ఉన్న ఇనిస్టిట్యూట్స్ లో విద్యార్థులకు ఆశించిన మేర బోధన అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.






