వివాదానికి ఇక ఎండ్ కార్డు.. కాసేపట్లో PCC చీఫ్ ఇంటికి ఆ ఇద్దరు మంత్రులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-08 04:54:27  IST  )

జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన వేళ మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), అల్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) మధ్య వివాదం తారా స్థాయికి చేరింది.

వివాదానికి ఇక ఎండ్ కార్డు.. కాసేపట్లో PCC చీఫ్ ఇంటికి ఆ ఇద్దరు మంత్రులు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన వేళ మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), అల్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) మధ్య వివాదం తారా స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ (Meenakshi Natarajan) మంత్రుల పంచాయితీపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అయితే వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని.. లేని పక్షంలో పార్టీకి డ్యామెజ్ అయ్యే ప్రమాదం ఉందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌కు సూచించారు. దీంతో ఆయన ఇవాళ నార్సింగి (Narsingi)లోని ఆయన నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మంత్రులు అడ్లూరితో పాటు పొన్నంను ఆహ్వానించారు. కాసేపట్లో వారు పీసీసీ చీఫ్ ఇంటికి చేరుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు పొన్నం తనకు క్షమాపణ చెప్పాల్సిందేనని మంత్రి అడ్లూరి పట్టుబడుతుండగా.. తాను ఆ మాటలను అడ్లూరిని అనలేదని పొన్నం అంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రులిద్దరూ సమన్వయంతో పని చేసుకోవాలని చెప్పి పీసీసీ చీఫ్ ఈ వివాదానికి ఎండ్ కార్డ్ వేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

Next Story