- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, డైనమిక్ బ్యూరో: నెర్రెలు బారిన తెలంగాణ నేలను కాళేశ్వర గంగతో అభిషేకించిన నిత్యకృషీవలుడు కేసీఆర్ (KCR).. అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కొనియాడారు. (Kaleshwaram Project) కాళేశ్వర గంగతో తెలంగాణ కాళ్లు కడిగిన రోజు నేడు.. అని ఇవాళ తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. కేసీఆర్ భగీరథ సంకల్పం సాకారమై నేటికి ఆరేళ్లు దాటిందని తెలిపారు. సముద్రం వైపునకు పరుగులు పెడుతోన్న గోదావరిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 530 మీటర్ల ఎగువకు ఎత్తిపోసి మన బీళ్లను సిరుల మాగాణంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఎన్నో అవాంతరాలు.. అనేక సవాళ్లు.. వివాదాల చిక్కుముడులను విప్పుకుంటూ మూడున్నరేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేశారని తెలిపారు. భారత దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ సాగునీటి రంగ చరిత్రలోనే ఇంత వేగంగా పూర్తి చేసిన ప్రాజెక్టు ఇంకొకటి లేదన్నారు.
ఇప్పటికే 20 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఇంకో 20 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చుకోవాలే.. అని పేర్కొన్నారు. కాళేశ్వరంపై రాజకీయ కుట్రల మేఘాలు ఒక్కొక్కటిగా వీడిపోతున్నాయని తెలిపారు. అపర భగీరథుడిపై నీలాపనిందలు పటాపంచలయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ఇప్పటికీ.. ఎప్పటికీ తెలంగాణకు కాళేశ్వరమే లైఫ్ లైన్.. అంటూ కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు.






