కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల కుట్ర అదే.. కిషన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |

ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) అత్యంత భయంకరమైనదని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల కుట్ర అదే.. కిషన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) అత్యంత భయంకరమైనదని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జీలు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని ఫైర్ అయ్యారు. చివరికి రాష్ట్ర బీజేపీ కార్యాలయ సిబ్బంది, సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ ఫోన్లను కూడా ట్యాప్‌ చేశారని తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే తమ ప్రభుత్వాన్ని ఎవ్వరూ నమ్మడం లేదంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని.. ఈ పరిస్థితులకు కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) చేసిన పాపాలే కారణమని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని.. ప్రజా సంక్షేమంలో దూసుకెళ్తున్న బీజేపీని అడ్డుకునేందుకు ఓ అవగాహనకు వచ్చాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. రెండు పార్టీల నిజ స్వరూపాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల ముందు పెట్టాలన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీయాలని పేర్కొన్నారు. జిల్లాలు, మండలాలతో పాటు గ్రామాల్లో కొత్త కమిటీలను ఏర్పాటు చేసుకున్నామని.. కొత్త రక్తంతో ప్రభుత్వంపై పోరుకు సిద్ధం కావాలని కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలునిచ్చారు.

Next Story