- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడిగడ్డపై కుట్ర కాంగ్రెస్ వాళ్లదే.. కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) హాజరయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) హాజరయ్యారు. బీఆర్కే భవన్‌లో ఆయనను కమిషన్ చైర్మన్ జస్టిస్ పీ చంద్రఘోష్, కార్యదర్శి మరళీధర్ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్కే భవన్ బయట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో వంద కాంపోనెంట్స్ ఉన్నాయని.. ఒక్కదాంట్లో చిన్న సమస్య వస్తే ఆ ప్రాజెక్టు మొత్తం వేస్ట్ అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్‌కు మంచి పేరు రావడం ఇష్టం లేక మేడిగడ్డపై కాంగ్రెస్ వాళ్లే కుట్రలు చేసి ఉంటారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నాలుగేళ్లలో పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు నీళ్లందించామని అన్నారు.
రాష్ట్రంలో రైతన్నలు సాగు నీటికి అలమటిస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రులకు శాఖలు డిసైడ్ చేసేందుకు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడని ఫైర్ అయ్యారు. నీటీ పారుదల రంగంపై కేసీఆర్‌కు ఉన్న అవగాహన మరెవరికీ ఉందని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయలేకనే.. ప్రజల దృష్టిని మరల్చడానికి కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఆడుతున్న డ్రామాలు ఇవి అని కామెంట్ చేశారు. కేసీఆర్‌పై కక్ష సాధింపు, రాజకీయ వేధింపులు తప్ప ఇందులో మరో విషయం లేదన్నారు. మరో వంద జన్మలెత్తినా.. కేసీఆర్ గొప్పతనం రేవంత్ రెడ్డికి అర్థం కాదని అన్నారు. రూ.94 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న వినడానికి ఫన్నీగా ఉందని.. రాబోయే రోజుల్లో వారు ప్రజల ముందు నవ్వులపాలు కాక తప్పదని కేటీఆర్ కామెంట్ చేశారు.






