- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Uttam : ప్రజల జీవితాల్లో వెలుగులే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం : మంత్రి ఉత్తమ్
ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకురావటానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి )Uttam Kumar Reddy)స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకురావటానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి )Uttam Kumar Reddy)స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ(Valigonda) మండలం నాతాళ్ల గూడెం(Natalla Gudem)లో ప్రజాపాలన నాలుగు సంక్షేమ పథకాలను స్థానిక భువనగిరి(Bhuvanagiri )ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy), ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbham Anil Kumar Reddy)లతో కలిసి ప్రారంభించి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంచారని, రైతు రుణ మాఫీ చేశామని తెలిపారు. ఈరోజు నుంచి భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ పథకం కింద రూ. 12000 ఇస్తున్నామని, ఈ పథకం కింద నాతాళ్ల గూడెంలో 5 కుటుంబాలకు అందిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి 12వేలు ఈ గ్రామంలో 380 మంది రైతులకు అందిస్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వం పదేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదని, రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు గతంలో ఉన్నాయని, అర్హులకు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకుందన్నారు. ఈ గ్రామంలో 96 కొత్త రేషన్ కార్డులు, గతంలో ఉన్న రేషన్ కార్డులకు అదనపు వ్యక్తులను చేర్చటం ద్వారా మరో 16 మందికి రేషన్ కార్డులు అందివ్వనున్నామని పేర్కొన్నారు. రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వనున్నామని ఇది దేశంలో ఎక్కడా లేదన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అర్హత ఉన్న వారికి ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షలు ఇవ్వనున్నామని, ఈ గ్రామం లో 98 మందికి 5లక్షల రూపాయల చొప్పున ఇల్లు కట్టుకోవడానికి ఈరోజు మంజూరీ పత్రాలు అందించామని తెలిపారు. మన రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 155 లక్షల మెట్రిక్ టన్నులు వరి పండిందన్నారు. మూసీ జలాలు వచ్చే బునాదిగాని, పిల్లయి పల్లి కాల్వల మరమ్మత్తులకు నిధులు ఇచ్చామని, బొల్లెపల్లి కాల్వ, భీమ లింగం కాల్వలకు నిధులు మంజూరు చెయ్యటానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.






