- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థానిక ఎన్నికలకు మోగనున్న నగారా.. సర్కార్‌కు అందిన ఎన్నికల డ్రాఫ్ట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా మోగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు రాష్ట్ర సర్కారు శుక్రవారం జీవో విడుదల చేయడంతో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు ఇవాళ ఎన్నికల డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని (Raani Kumudini) ప్రభుత్వానికి అందజేశారు. మొత్తం రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచనల మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో మార్పులు, చేర్పులు చేసి సాయంత్రానికి ఎన్నికల ప్రకటన చేసే అవకాశం ఉంది.
కాగా, మరికొద్దిసేపట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల సన్నద్ధతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు (CS Ramakrishna Rao), డీజీపీ జితేందర్ (DGP Jitender)తో భేటీ కాబోతున్నారు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సమ్మతి తెలియజేస్తూ ఆర్డర్ కాపీ అందజేయనున్నారు. ఏయే జిల్లాల్లో ఎన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలు ఉన్నాయి.. ఎంతమంది ఎన్నికల సిబ్బంది అవసరం? ఎన్ని విడతల్లో ఎన్నికల నిర్వహణ పూర్తి చేసే అవకాశం ఉంది లాంటి తదితర అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ (BC Dedicated Commission) రిపోర్టు ఆధారంగా బీసీలకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసిన విషయం తెలిసిందే..






