- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర మద్దతు ధర ప్రకటించి కొనుగోలు భారం రాష్ట్రాలపై మోపుతుంది : మంత్రి తుమ్మల
కేంద్రం మద్దతు ధర ప్రకటించి, పంటలను కొనే బాధ్యతను రాష్ట్రాలపై వేస్తుందని, రాష్ట్రంపై అధిక భారం పడుతుందని మంత్రి తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు.

- రైతులకు కనీస ధర వస్తుందా అనే విషయం కూడా పట్టించుకోవడం లేదు
- అధిక దిగుబడి మార్కెట్లో డిమాండ్ ఉన్న విత్తనాలనే అందుబాటులో ఉంచాలి
- మద్దతు ధర ప్రకటించిన పంటలన్నింటిని కేంద్రమే కొనాలి
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రం మద్దతు ధర ప్రకటించి, పంటలను కొనే బాధ్యతను రాష్ట్రాలపై వేస్తుందని, దీంతో రాష్ట్రంపై అధిక భారం పడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర ప్రకటించిన ప్రతి పంటను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సచివాలయంలో రైతు కమిషన్ తో కలిసి వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం అందుబాటులో ఉంచాల్సిన వరి రకాల ఎంపిక, విత్తన లభ్యత, సాగు ప్రణాళికలపై వ్యవసాయశాఖ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్రం ప్రకటనలకే పరిమితమైందని, మద్దతు ధర ప్రకటించి రైతులకు ఆ ధర లభిస్తుందనే విషయం పట్టించుకోవడం లేదన్నారు. బహిరంగ మార్కెట్లో కూడా మద్దతు ధర అందే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, దీంతో రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు మద్ధతు ధర రాకుండా నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో రైతుల వద్ద నుండి మద్ధతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, దీంతో అదనపు భారం పడుతోందన్నారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వంపై రూ.2 వేల నుండి 3 వేల కోట్లు అదనంగా భారం పడుతుందని, అయిన కేంద్రం నుండి ఎలాంటి సహాకారాలు అందడం లేదన్నారు. మద్దతు ధర ప్రకటించే ప్రతి పంటను పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆదాయం వచ్చే విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలి
వ్యవసాయశాఖ అధికారులు వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం బీపీటీ -5024, ఆర్ఎన్ఆర్-15048, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరాం, కెఎన్ఎం-1638, డబ్బూజీఎల్-44, 962, జేజీఎల్ 1798 సన్న రకాలను సిద్ధం చేసినట్లు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం 33 రకాల సన్న రకాలను అందుబాటులో ఉంచడంతో రైతులు అమ్మకాలప్పడు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కొన్నింటికి బోనస్ కూడా రాకుండా ఇబ్బందులు పడ్డట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ సంవత్సరం అలాంటి సమస్యలు రాకుండా పరిమిత రకాలు రైతులకు అధిక దిగుబడి ఇచ్చే రకాలు అందుబాటులో ఉంచడంపై దృష్టి పెట్టాలని సూచించారు. పౌరసరఫరాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని రాష్ట్రం, కేంద్రం కొనుగోలు చేసే పరిమాణాల ఆధారంగా విత్తనాల సరఫరా ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. మే 15 కల్లా ఎంపిక చేసిన విత్తన రకాలతో పాటు అధిక దిగుబడి మార్కెట్లో డిమాండ్ ఉన్న విత్తనాలనే అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. సీడ్ కార్పొరేషన్ ద్వారా ఈ విత్తనాలను సరఫరా చేయడంతో పాటు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఇదే రకాల విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం రైతు కమిషన్చైర్మన్కోదండరెడ్డి వివరిస్తూ కేంద్రం ప్రకటించే మద్దతు ధర శాస్త్రీయంగా లేదని దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతు సంఘాలు, స్వామి నాథన్ కమిషన్ సిఫారసులను కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయ అగ్రికల్చర్ శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.






