- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఎస్సీ వర్గీకరణ అధికారాన్ని రాష్ట్రాలకు కల్పిస్తూ కేంద్రం చట్టం చేయాలి: కోదండరామ్
దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. ఎమ్మార్పీఎస్ 30 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎస్సీ వర్గీకరణ సాధనకై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ దీక్ష చేపట్టారు. ఇవాళ ఇందిరాపార్క్ దర్నాచౌక్‌లో ఏర్పాటు చేసిన ఈ దీక్షకు కోదండరామ్, ప్రజాగాయని విమలక్క, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నదన్నారు.
ఇది న్యాయమైన డిమాండ్ అని స్పష్టం చేశారు. దీనిపై పార్లమెంట్‌లో చట్టం తేవాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అధికారాన్ని రాష్ట్రాలకు కల్పిస్తూ చట్టాన్ని చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ చట్టం వల్ల రాష్ట్రంలో వర్గీకరణకు అవకాశం కలుగుతుందని వెల్లడించారు. చట్టాన్ని తీసుకురావడం కోసం మాదిగ సమాజాన్ని ఎమ్మార్పీఎస్ ఏకతాటిపై తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు.