- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సకాలంలో కేంద్రం యూరియా సరఫరా చేయాలి : మంత్రి తుమ్మల
ఈ సీజన్ లో కేంద్రం కేటాయించిన ఎరువులను 60 నుంచి 70 శాతం అక్టోబర్, నవంబర్ ,డిసెంబర్ లలో సరఫరా చేసినట్లయితే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ చేయవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆశాభావం వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ సీజన్ లో కేంద్రం కేటాయించిన ఎరువులను 60 నుంచి 70 శాతం అక్టోబర్, నవంబర్ ,డిసెంబర్ లలో సరఫరా చేసినట్లయితే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ చేయవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం యాసంగి సీజన్ కి సంబంధించిన ఎరువుల సరఫరాలపై రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కేటాయించిన ఎరువులలో 70 శాతం వరకు ముందస్తుగా తెప్పించుకంటే తరువాత నిరంతరం వచ్చే ఎరువులతో కలిపి రైతులకు అవసరమున్నంత మేరకు ఈ యాసంగిలో పంపిణీ చేయవచ్చని అధికారులకు సూచించారు.
కేంద్రం ప్రభుత్వం అక్టోబర్, నవంబర్ నెలలకు రాష్ట్రం కోరినట్లుగా నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల మేర యూరియా కేటాయించిందని, గత నెలలో ఇంకా 37 వేల మెట్రిక్ టన్నుల యూరియా, ఓడరేవుల నుండి రాష్ట్రానికి చేరుకోవాల్సి ఉందని, ఈ నెలలో ఇప్పటికే 25 వేల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి చేరుకున్నట్లు, దీంతో 1.88 లక్షల మెట్రిక్ టన్నులు అక్టోబర్ నుండి ఇప్పటివరకు సరఫరా అయినట్లు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1.43 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 58 వేట టన్నుల డిఎపి, 2.09 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఈ బఫర్ నిల్వలు రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయని పేర్కొన్నారు. రైల్వే శాఖ వరంగల్ రేక్ పాయింట్ ను మూసివేసి గూడ్స్హ్యాడ్లింగ్స్ ను చింతలపల్లి పాయింట్ కు మార్చాలని నిర్ణయించడం జరిగిందని, ఒక్కసారిగా వరంగల్ రేక్ పాయింట్ ను మూసివేయడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎరువుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.
4 నుండి 5 నెలల పాటు అది పూర్తి స్థాయిలో వాడకంలో వచ్చేదాకా వరంగల్ రేక్ పాయింట్ ను కొనసాగించాలని రైల్వే మంత్రికి లేఖ ద్వారా అభ్యర్థించారు. మరోవైపు నవంబర్ నెల యూరియా సరఫరా ప్రణాళిక ప్రకారం రాష్ట్రానికి 2 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్ర ఎరువుల శాఖ కేటాయించగా, అందులో 1.29 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి యూరియాకాగా, మిగతా 0.71 లక్షల మెట్రిక్ టన్నులు దేశీయ వనరుల నుండి కేటాయించబడ్డాయి. అక్టోబర్ నెలకు సంబంధించి సీఐఎల్, ఐపీఎల్కంపెనీల నుండి రాష్ట్రానికి రావాల్సిన దిగుమతి యూరియాలో 0.37 లోటు ఏర్పడిందని అన్నారు.
రాష్ట్రంలో యూరియా వినియోగం ప్రధానంగా డిసెంబర్ మూడో వారం నుండి ఉంటుందని, ఆ సమయంలో మక్కజొన్న, వరి పంటలతో గరిష్ట స్థాయికి చేరుకుంటుందన్నారు. ఈ సమయాలలో ఎరువుల కొరత రాకుండా ఉండటానికి కేంద్రం వెంటనే 0.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతి యూరియా కేటాయించడంతో పాటు, సీఐఎల్ద్వారా త్వరితగతిన రవాణా చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిని కోరారు. అనంతరం డైరెక్టర్ గోపి వివరిస్తూ యాసంగి సీజన్ కోసం 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 1.45 లక్షల మెట్రిక్ టన్నుల డిఎపి, 7 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 0.65 లక్షల మెట్రిక్ టన్నులు ఎమ్ఓపి, 0.60 లక్షల మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పి ఎరువులను రాష్ట్రానికి కేటాయించడం జరిగిందన్నారు.
మంత్రి ఆదేశాలతో రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో 6 లక్షల మెట్రిక్ టన్నులను అక్టోబర్, నవంబర్ , డిసెంబర్ నెలలలో నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున సరఫరా చేయాలని కోరినట్లు తెలిపారు. దానికి తగ్గట్లుగా నిరంతరము సంబంధిత అధికారులతో సంప్రదిస్తూ రాష్ట్రానికి రావాల్సిన ఎరువులను ముందుగానే తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.






