ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను కేంద్రం జాతీయం చేయాలి: సీపీఐ నారాయణ డిమాండ్

by Kema Shiva Kumar |

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ (IndiGo Airlines)పై కేంద్ర ప్రభుత్వం తొలి వేటు వేసింది.

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను కేంద్రం జాతీయం చేయాలి: సీపీఐ నారాయణ డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండిగో ఎయిర్‌లైన్స్‌ (IndiGo Airlines)పై కేంద్ర ప్రభుత్వం తొలి వేటు వేసింది. దేశవ్యాప్తంగా వందలాది విమానాల రద్దు, వాయిదాలకు కారణమైనందుకు గాను క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇండిగో సంస్థకు ఉన్న స్లాట్లలో 5 శాతం మేర కోత విధించింది. దీంతో ఇకపై ఇండిగో సంస్థ నడిపే విమానాల సంఖ్యలో కనీసం 110 వరకు తగ్గనున్నాయి. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి.

మరోవైపు ఇండిగో సంక్షోభంపై పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను కేంద్ర ప్రభుత్వం వెంటనే జాతీయం చేయాలని సీపీఐ నారాయణ (CPI Narayana) డిమాండ్ చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్రం పెట్టిన నిబంధనలు అమలు చేయకుండా ఇండిగో యాజమాన్యం బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర విమానయాన రంగంలో ఇండిగో వాటా 64 శాతంగా ఉందని తెలిపారు. పబ్లిక్ సెక్టార్‌లో విమానాలు లేకపోవడం వల్లే ఇలాంటి సంక్షోభాలు తెచ్చిపెడుతున్నాయని సీపీఐ నారాయణ అన్నారు.

Next Story