- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి.. మంత్రి సీతక్క హాట్ కామెంట్స్
తెలంగాణ-ఛత్తీస్‌గడ్ (Telangana-Chhattisgarh)లో సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ-ఛత్తీస్‌గడ్ (Telangana-Chhattisgarh)లో సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) విషయంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) పట్టు వీడే పరిస్థితులు కనిపించడం లేదు. దాదాపు 20వేల భద్రతా సిబ్బంది కర్రిగుట్టల్లో (Karrigutta's) మావోయిస్టు (Maoists) అగ్రనేతు, దళ సభ్యుల కోసం జల్లెడ పడుతున్నారు. బుధవారం ఆపరేషన్‌లో భాగంగా కర్రిగుట్టపై సీఆర్‌పీఎఫ్ (CRPF) దళాలు జాతీయ జెండాను ఎగురువేయడం చర్చనీయాంశంగా మారింది. అక్కడే పర్మినెంట్ బేస్ క్యాంపు (Permanent Base Camp)లను ఏర్పాటు చేసేందుకు భద్రతా దళాలు సన్నాహాలు మొదలు పెట్టాయి. ప్రస్తుతం కర్రిగుట్ట పరధిలోని దోబికొండ (Dobikonda), నీలం సరాయి (Neelam Sarai) గుట్టలు పూర్తి స్థాయిలో వారి ఆధీనంలోకి వచ్చినట్లుగా ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఈ క్రమంలోనే కూంబింగ్ (Combing) కారణంగా అక్కడ కాల్పుల మోతతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై తాజాగా ఇవాళ మంత్రి సీతక్క (Minister Seethakka) స్పందించారు. ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) విషయంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. కర్రిగుట్టల్లో కేంద్ర బలగాల ఆంక్షలతో ఆదివాసీ (Adivasis)ల మనుగడ ప్రశ్నార్థకం అవుతోందని కామెంట్ చేశారు. అక్కడి ప్రజలు జీవనాధారం కోల్పోయి.. కుటుంబాలు గడవని పరిస్థితులు ఏర్పాడుతున్నాయని అన్నారు. అదేవిధంగా రాత్రింబవళ్లు కాల్పులతో అక్కడి జనం భయభ్రాంతులకు లోనవుతున్నారని ఫైర్ అయ్యారు. ‘ఆపరేషన్ కగార్’ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలని.. ఆదివాసీల జీవనానికి ఇబ్బంది లేకుండా చూడాలి సీతక్క కోరారు.






