​మెట్రో రెండో దశ ప్రాజెక్టు పనులకు కేంద్రానికి ఎలాంటి ఇబ్బంది లేదు !

by velandi.Saikiran |

బుధవారం ఢిల్లీలో హైదరాబాద్​నగరంలో జరుగుతున్న వివిద కీలక ప్రాజెక్టులపై కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్​ఖట్టర్​తో సమావేశమైయ్యారు.

​మెట్రో రెండో దశ ప్రాజెక్టు పనులకు  కేంద్రానికి ఎలాంటి ఇబ్బంది లేదు !
X

నగరంలో నిర్మించే 39 సీవరేజ్​ట్రిట్​ప్లాంట్​కు రూ. 3975 కోట్ల వ్యయం

​మెట్రో రెండో దశ ప్రాజెక్టు పనులకు కేంద్రానికి ఎలాంటి ఇబ్బంది లేదు : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి​

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకంలో భాగంగా మూసీనదిలో కలుస్తున్న మురుగు నీటిని శుద్ధి చేసేందుకు 39 సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను మంజూరు చేసిందని, ఈ ప్రాజెక్టుల వ్యయం రూ.3,975 కోట్లు ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. బుధవారం ఢిల్లీలో హైదరాబాద్​నగరంలో జరుగుతున్న వివిద కీలక ప్రాజెక్టులపై కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్​ఖట్టర్​తో సమావేశమైయ్యారు. ఈఎస్టీపీల ద్వారా రోజుకు 972 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉందన్నారు. దీంతో శుద్ధి చేయని వ్యర్థపు నీరు నేరుగా మూసీనదిలో కలవకుండా నిరోధించడంతోపాటు మూసీనది పరిరక్షణ, నగర పారిశుద్ధ్య మెరుగుదలకు ఎంతో దోహదపడుతుందని ఖట్టర్ వెల్లడించినట్లు చెప్పారు.

మెట్రో రెండోదశ ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపైనా సమావేశంలో చర్చ జరిగిందని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎల్​అండ్​టీ సంస్థ నుంచి టేకేవర్ చేసుకోవడంతో మిగిలిన రెండోదశ పనులకు సంబంధించిన డిటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ , ఇతర సాంకేతిక వివరాలు అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. హైదరాబాద్ మెట్రో రెండోదశ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 ఖర్చుచేసే ప్రాతిపదికన కేంద్రం ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 162 కిలోమీటర్ల మేర మెట్రో రెండోదశ విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించిందని దానిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపడుతుందని వెల్లడించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోందన్నారు.

Next Story