- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం.. రామయ్య వైపు పీసీసీ చీఫ్.. సీతమ్మ వైపు కవిత
నిజామాబాద్‌లోని చారిత్రాత్మక రఘునాథ ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే రామాలయాలన్నీ భక్తుల ‘జైశ్రీరామ్’ నినాదాలతో మారుమోగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ పట్టణంలోని చారిత్రాత్మక శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రామాలయం)లో సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. ఈ రమణీయ వేడుకలో ఓ ఆసక్తికరమైన దృశ్యం చోటుచేసుకుంది. లోకకళ్యాణం కోసం జరిగిన ఈ క్రతువులో రాజకీయాలకు అతీతంగా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత, ఆమె భర్త దేవనపల్లి అనిల్ దంపతులు పెళ్లికూతురు సీతమ్మ తల్లి తరపున నిలిచి కళ్యాణాన్ని జరిపించారు. ఇక పెళ్లికొడుకు రామయ్య తండ్రి తరపున టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉండి ఈ పవిత్ర కార్యంలో పాలుపంచుకున్నారు.
ముత్యాల తలంబ్రాల సమర్పణ..
కళ్యాణోత్సవం సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్, కవిత-అనిల్ దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు, మెరిసిపోయే ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య జరిగిన ఈ వేడుకను చూసేందుకు వచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు, వడపప్పుతో పాటు బెల్లం పానకాన్ని పంపిణీ చేశారు.






