- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ముగిసిన BJP అగ్రనేతల టూర్.. రేపు రంగంలోకి మరికొందరు..!
బీజేపీలో అగ్ర త్రయంగా పిలుచుకునే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ ఎన్నికల టూర్ ముగిసింది. మూడ్రోజులుగా వారు

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీలో అగ్ర త్రయంగా పిలుచుకునే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ ఎన్నికల టూర్ ముగిసింది. మూడ్రోజులుగా వారు తెలంగాణలోనే మకాం వేశారు. తెలంగాణవ్యాప్తంగా విస్తృతంగా మోడీ, షా, నడ్డా ప్రచారం చేపట్టారు. కాగా కీలకమైన చివరి రోజు మాత్రం ప్రచారానికి దూరంగా ఉండనున్నారు. ప్రధాని మోడీ, షా, నడ్డా సభలు, రోడ్ షోలతో శ్రేణుల్లో జోష్ నింపిందని చర్చించుకుంటున్నారు. గెలుపు తథ్యమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా చివరిరోజు ప్రచారానికి కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అన్నామలై ప్రచారం చేపట్టనున్నారు.
మంగళవారం హన్మకొండలో బీజేపీ అభ్యర్థి రావు పద్మ తరుపున కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. నిజామాబాద్ అర్బన్‌లో అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తకు మద్దతుగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ప్రచారం నిర్వహించనున్నారు. సంగారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి పులిమామిడి రాజుకు మద్దతుగా ప్రచారానికి కేంద్రమంత్రి భగవత్ ఖరద్ జీ రానున్నారు. ఆదిలాబాద్ అభ్యర్థి పాయల్ శంకర్‌కు మద్దతుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ప్రచారం చేయనున్నారు.
అనంతరం బేల మండలంలోనూ ఆయన ప్రచారం చేయనున్నారు. అలాగే ధర్మపురి అభ్యర్థి ఎస్ కుమార్‌కు మద్దతుగా సైతం ఆయన ప్రచారం చేపట్టనున్నారు. దేవరకొండ అభ్యర్థి కేతావత్ లాలునాయక్‌కు మద్దతుగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రచారం చేయనున్నారు. ఆ సభ అనంతరం పాలకుర్తి అభ్యర్థి లేగ రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా, సాయంత్రం నర్సంపేట అభ్యర్థి పుల్లారావుకు మద్దతుగా ఫడ్నవీస్ ప్రచారంలో చేపట్టనున్నారు.






