రైతుబంధుపై మంత్రులు మాట్లాడితే నోటీసులు ఇవ్వాలి.. ఆపడం అన్యాయం

by Malleboina Mahesh |

రైతుబంధు అనుమతి ఉపసంహరణ నేపథ్యంలో సీఈఓ వికాస్ రాజును బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సోమవారం కలిసింది.

రైతుబంధుపై మంత్రులు మాట్లాడితే నోటీసులు ఇవ్వాలి.. ఆపడం అన్యాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతుబంధు అనుమతి ఉపసంహరణ నేపథ్యంలో సీఈఓ వికాస్ రాజును బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సోమవారం కలిసింది. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు మాట్లాడుతూ.. రైతుబంధుపై మంత్రులు మాట్లాడితే వాళ్లకు నోటీసులు ఇవ్వాలని.. దానిని ఎలా అపుతారని ప్రశ్నించారు. రైతుబంధు అనేది ఆన్ గోయింగ్ స్కీం అన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అపుతారని ప్రశ్నించారు. రాజకీయ నేతల్లో ఉన్న కోపతాపాలను రైతుల మీద రుద్దకూడదని హితవు పలికారు.

రైతుబంధును కాంగ్రెస్ వాళ్లు ఆపారని తాను అనడం లేదన్నారు. ఈసీఐతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కోర్టుకు వెళ్లేందుకు టైం లేదని.. మేము రేపటి వరకు విత్ డ్రా చేయించే ప్రయత్నం చేస్తామన్నారు. లేదంటే రైతులు అర్థం చేసుకోవాలని.. రెండు మూడు రోజులు ఓపిక పట్టాలని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్, బీఆర్ఎస్ ఎల్పి కార్యదర్శి రమేష్ రెడ్డి ఉన్నారు.

Next Story