- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలేశ్వరం,మిషన్ భగీరథ పేరుతో కోట్ల కుంభకోణం చేసిన బీఆర్ఎస్ పార్టీ
రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ పేరుతో,ఇంటి ఇంటికి మీషన్ భగీరథ నీళ్లు ఇస్తామని చెప్పి కోట్ల కుంభకోణం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ,కల్వకుంట్ల కుటుంబమని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆరోపించారు.

దిశ,దుబ్బాక : రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ పేరుతో,ఇంటి ఇంటికి మీషన్ భగీరథ నీళ్లు ఇస్తామని చెప్పి కోట్ల కుంభకోణం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ,కల్వకుంట్ల కుటుంబమని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాల్ పట్టణంలోని డబుల్ బెడ్ రూం కాలనీలో ఆదివారం రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మున్సిపల్ ఎలక్షన్ లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గాలి నడుస్తుందని మున్సిపాలిటీలలో 80 నుంచి 85 వరకు కాంగ్రెస్ జెండా ఎగుతుందన్నారు. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన అభివృద్ధిని చూసి ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని చూస్తున్నారని మంత్రి అన్నారు. చెన్నురు నియోజకవర్గం డీ.ఎమ్.ఎఫ్టి నిధులు హరీష్ రావు సిద్దిపేట కు ఎలా తీసుకెళ్లిడో అలాగే దుబ్బాక నియోజకవర్గం, గజ్వేల్,సిరిసిల్ల నియోజకవర్గల నిధులు సిద్దిపేట కు తీసుకెళ్లాడని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులకే ఈ డీ,ఎమ్,ఎఫ్టీ నిధులు డైవర్ట్ అయ్యాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో వెయ్యి కోట్లు ఫిక్స్ డిపాజిట్ ఉన్నాయ్ అంటే అది కేవలం రాష్ట్ర ప్రజల ధనం దోచుకుని కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ అని చెప్పుకొని వేల కోట్ల కుంభకోణం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు.
త్వరలోనే దుబ్బాక ఆర్టీసీ బస్సు డిపోకు 10 బస్సులు
రూ,8 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ అన్నారు.దుబ్బాక పట్టణంలోని డబుల్ బెడ్ రూం కాలనీ ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నరని వారికి డబుల్ బెడ్ రూం నిర్మించి ఇచ్చారు తప్ప లబ్ధిదారులకు ఇప్పటి వరకు పట్టాల ఇవ్వలేదన్నారు. డబుల్ బెడ్ రూంలలో ఉంటున్న లబ్ధిదారులకు 100 రోజుల్లోనే పట్టాలు ఇవ్వడం జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చారు. దుబ్బాక ఆర్టీసీ బస్సు డిపోలో అదనంగా 10 బస్సులు అవసరం ఉన్నందున రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి 10 బస్సులను అలార్డ్ చేయడం జరిగిందని దాంతో దుబ్బాక ప్రాంత ప్రజలకు ప్రయాణం చేసే వారికి ఇబ్బందులు లేకుండా పోతుందన్నారు.ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే దుబ్బాక ను రెవెన్యూ డివిజన్ గా చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పుల్లో ఉన్నప్పటికీ దుబ్బాక మున్సిపాలిటీకి రూ,15 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. దుబ్బాక మున్సిపాలిటీ ఓటర్ మహాశయులకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించుకొని దుబ్బాక మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని కోరారు.






