- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ జిల్లాలో పర్యటించారు.

దిశ, నల్లగొండ: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) నల్లగొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండను ఒక సాదాసీదా పట్టణం నుండి అత్యాధునిక 'మహానగరంగా' తీర్చిదిద్దడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. అందులో భాగంగానే నల్లగొండను కార్పొరేషన్‌గా మార్చుకున్నామని, ఈ అభివృద్ధి యజ్ఞంలో మన భాగస్వామ్యం చారిత్రాత్మకం కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటి మహిళా మేయర్‌గా చైతన్య శ్రీనివాస్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారమే శ్వాసగా పనిచేసే బుర్రి శ్రీనివాస్ రెడ్డి, చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంపతుల సేవలు నగరానికి ఎంతో అవసరమని చెప్పారు.
మన లక్ష్యం - భారీ మెజారిటీ
నల్లగొండను అంతర్జాతీయ స్థాయి వసతులతో తీర్చిదిద్దే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. పార్టీ కోసం కష్టపడే నాయకులకు తగిన గుర్తింపు ఉంటుంది. త్వరలోనే గుమ్ముల మోహన్ రెడ్డికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి రాబోతోంది. ఫిబ్రవరి 11న జరిగే ఎన్నికల్లో 32వ డివిజన్ ప్రజలు ఏకతాటిపై నిలబడి, బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించాలి. ‘మన లక్ష్యం - భారీ మెజారిటీ’ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఓటరు, సంక్షేమాన్ని కోరుకునే ప్రతి ఇల్లూ హస్తం గుర్తుకే ఓటు వేయాలి. నల్లగొండ కార్పొరేషన్ పీఠంపై మహిళా చైతన్యాన్ని ఆశీర్వదించాలి అని మంత్రి అన్నారు.






