- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెర : బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.

- 9292 ఎకరాల భూ కుంభకోణంతో రూ. 6.29 లక్షల కోట్ల లూఠీ
- హిల్ట్ పాలసీ ఉపసంహరించుకునే వరకు బీజేపీ ఉద్యమిస్తుంది
దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో సీఎం రేవంత్ రెడ్డి తన అనుచరులతో ఈ కుంభకోణానికి పథకం వేశారని మండిపడ్డారు. బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో హిల్ట్‌పాలసీపై పవర్ప్రజేంటేషన్నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవో నెంబర్ 27 తీసుకొచ్చి 9292 ఎకరాలకు సంబంధించి 22 ఎస్టేట్స్ లను మల్టీ జోన్స్ కు కన్వర్ట్ చేయడానికి ఈ పథకం వేశారని, కేవలం రిజిస్ట్రార్ శాఖ విలువలో 30 శాతానికి దారదాత్తం చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు ఈ ఆస్తి విలువ 6.30 లక్షల కోట్లకు పైనే ఉంటుందని, దీంతో రాష్ట్ర అప్పును తీర్చవచ్చని ఇది తెలంగాణ ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపే పాలకులు ప్రజల ఆస్తిని కొల్లగొడుతూ క్లెప్టోక్రిసి పాలన రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. సామాన్యులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం గతంలో పారిశ్రామిక వాడలుగా గుర్తించిన ఈ భూములను, ఓ ఆర్ఆర్ లోపల గల వేల ఎకరాల భూములకు ప్రభుత్వం లూటీ చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ పాలసీ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తుందో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కేవలం తమ స్వార్థం కోసమే, దేశంలో రిచెస్ట్ పొలిటీషియన్ కావాలని ఉద్దేశ్యంతో ఈ కుంభకోణానికి తెరలేపారని విమర్శించారు. అనేక సార్లు రాష్ట్ర అప్పు గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ ఆస్తి తో రాష్ట్రాన్ని గాడిలో పెట్టవచ్చనే సంగతి తెలియదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో సీఎం గా కేసీఆర్ సైతం ఇలాంటి పాలసీ తీసుకొచ్చి వేల ఎకరాల భూ కుంభకోణం చేశారని దుయ్యబట్టారు. వాళ్ళు దొంగలుగా మారితే కాంగ్రెస్‌నేతలు గజ దొంగలుగా మారారని విరుచుకుపడ్డారు.
కేసీఆర్బాటలో సీఎం రేవంత్ముందుకు
గత పాలకులు తప్పిదం చేస్తే విచారణ వేసి దోషులను శిక్షించాల్సింది పోయి, అదే తోవలో నడవడం సిగ్గు చేటన్నారు. కనీసం మంత్రివర్గంలోనైనా సుదీర్ఘ చర్చ జరపకుండా డ్రాఫ్ట్ కాపీలను సైతం మంత్రులను నమ్మకుండా వారి వద్ద నుండి తిరిగి తీసుకున్నారంటే దీనిపై లోతైన చర్చ తప్పక జరపాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దీనిపై సబ్ కమిటీ వేశామని చెప్పారని ఈ సబ్ కమిటీలో ఎవరెవరూ పాల్గొన్నారో చెప్పాలని డిమాండ్‌చేశారు. పరిశ్రమలను తరలించడానికి గల ముఖ్యకారమేంటో చెప్పాలని కేవలం పొల్యూషన్ పేరిట షిఫ్ట్ చేస్తామనడం అంశంపై ఎన్విరాన్మెంటల్ స్టడీ ఏమైనా జరిగిందా చెప్పాలన్నారు. దశాబ్దాలుగా పారిశ్రామిక వాడల్లో పేరుకుపోయిన పారిశ్రామిక వ్యర్థాలు, కలుషితమైన భూమి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 22 పారిశ్రామిక వాడల్లో అన్ని పరిశ్రమలు పొల్యూషన్ కి చెందినవేనా, అందులో ఇతర పొల్యూషన్ ప్రభావం లేని పరిశ్రమలు లేవా లేదా అన్ని పరిశ్రమలు షిఫ్ట్ చేస్తున్నారా సమాధానం చెప్పాలన్నారు. తమ పార్టీ డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ హిల్ట్ పాలసీ ను ఉపసంహరించుకోని, జీవో రద్దు చేయాలని సూచించారు. భావితరాలకు చెందాల్సిన ఆస్తిని అప్పనంగా ఎవరికి దారబోస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. రిజిస్ట్రేషన్‌శాఖ విలువలో 30 శాతానికే ఎందుకు కేటాయించాల్సి వచ్చింది, సబ్ కమిటీ రిపోర్ట్, ఎన్విరాన్మెంటల్ స్టడీ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ హిల్ట్ పాలసీని, సంబంధిత జీవోను తక్షణమే రద్దు చేయాలని లేకుంటే బీజేపీ ఈ కుంభకోణం పై ఉద్యమం చేస్తుందని, ప్రజా క్షేత్రంలో దోషులను నిలబెట్టేవరకు పోరాటం చేస్తుందని హెచ్చరించారు.






