భారత జట్టులో అదరగొడుతున్న భద్రాచలం యువతి.. ఇవాళ్టి మ్యాచ్‌లో తనే హైలైట్

by Gantepaka Srikanth |

మలేషియా(Malaysia)లోని కౌలాలంపూర్‌(Kuala Lumpur) వేదికగా జరిగిన అండర్-19 మహిళల వరల్డ్‌ కప్‌‌(ICC Under-19 Womens T20 World Cup 2025)లో స్కాట్లాండ్‌(Scotland) జట్టుపై టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది.

భారత జట్టులో అదరగొడుతున్న భద్రాచలం యువతి.. ఇవాళ్టి మ్యాచ్‌లో తనే హైలైట్
X

దిశ, వెబ్‌డెస్క్: మలేషియా(Malaysia)లోని కౌలాలంపూర్‌(Kuala Lumpur) వేదికగా జరిగిన అండర్-19 మహిళల వరల్డ్‌ కప్‌‌(ICC Under-19 Womens T20 World Cup 2025)లో స్కాట్లాండ్‌(Scotland) జట్టుపై టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. సూపర్ సిక్స్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లోనూ సత్తా చూపించింది. ఇవాళ్టి మ్యాచ్‌లో తెలంగాణలోని భద్రాచలం ప్రాంతానికి చెందిన క్రికెటర్ గొంగడి త్రిష(Gongadi Trisha) అదరగొట్టారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్‌లో సెంచరీ చేసిన త్రిష.. బౌలింగ్‌లో అదరహో అనిపించింది. ఏకంగా మూడు కీలకమైన వికెట్లు పడగొట్టి స్కాట్లాండ్‌ను చావుదెబ్బ కొట్టింది. దీంతో స్కాట్లాండ్‌ను భారత్‌ 150 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా.. నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చి స్కాట్లాండ్‌(Scotland) మొదటి నుంచి కష్టాలు పడింది. 14 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలిపోయింది. ఓపెనర్లు పిప్పా (12), వాల్‌సింగమ్‌ (12), పిప్పా స్ప్రౌల్ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. భారత్‌ బౌలర్లలో శుక్ల 4 వికెట్లు పడగొట్టగా, వైష్ణవి శర్మ, త్రిష చెరో 3 వికెట్లు తీశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన(All-round performance) చేసిన త్రిషకు ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు(Player of the Match Award) వచ్చింది. వరల్డ్‌ కప్‌లో ఇప్పటికే భారత్ సెమీస్‌ చేరిన సంగతి తెలిసిందే. జనవరి 31న సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇదిలా ఉండగా.. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ త్రిష అద్భుతంగా రాణిస్తోంది.

Next Story