ఉత్తమ పోలీసులకు మెడల్స్

by Dishafeatures2 |
ఉత్తమ పోలీసులకు మెడల్స్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెంట్ మెడల్స్, గ్యాలంటరీ పతకాలను ప్రకటించింది. తెలంగాణ నుంచి 34మంది పోలీసు సిబ్బందికి ఈ పతకాలు దక్కాయి. తెలంగాణ నుంచి మెరిటోరియస్ మెడల్స్ సాధించిన వారిలో హైదరాబాద్ కమిషనరేట్లో ఏఎస్సైగా పని చేస్తున్న సాయన వెంకటేశ్వర్లు, అడిషనల్​ ఎస్పీ బండి వెంకటేశ్వర రెడ్డి, అదనపు ఎస్పీలు (అడ్మిన్) కొమ్మిశెట్టి రామకృష్ణ, ఆత్మకూరి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ రిజర్వ్ అందోజు సత్యనారాయణ, వరంగల్​లో అసిస్టెంట్​ ఎస్సైగా పని చేస్తున్న కక్కెర్ల శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా ఆర్ఐ అజెల్ల శ్రీనివాసరావు, సీనియర్​ కమాండో రాసమోని వెంకటయ్య, హైదరాబాద్​ లో సీఐగా పని చేస్తున్న అరవేఇ భాను ప్రసాదరావు, అసిస్టెంట్​ రిజర్వ్ ​ఎస్సై మహంకాళి మధు ఉన్నారు.

ప్రెసిడెంట్​ పోలీస్ మెడల్స్

ఇక, ప్రెసిడెంట్​ పోలీస్ మెడల్స్ సాధించిన వారిలో అదనపు డీజీ విజయ్​ కుమార్, ఎస్పీ మాదాడి రమణ ఉన్నారు.

గ్యాలంటరీ అవార్డులు

ఇక, పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డులు పొందిన వారిలో ఎస్పీ భాస్కరన్, హెడ్ కానిస్టేబుల్ కే.అశోక్, పోలీస్​కానిస్టేబుళ్లు​ సందీప్​కుమార్, కార్తిక్, మధు, సంపత్, సుశీల్ (చనిపోయారు), సునీల్ కుమార్, సుకుమార్, మహేందర్​రావు, బక్కెర శివకుమార్, కళ్యాణ్​కుమార్, శ్రీధర్, రవీంద్రబాబు, రాథోడ్​రమేశ్, ఆర్ఐ రమేశ్, ఆర్ఎస్సైలు మహేశ్, నాగుల్​మీరా, హెడ్​కానిస్టేబుల్​ఆదినారాయణ, సీఐలు పురుషోత్తంరెడ్డి, శివప్రసాద్, ఎస్సై బండారి కుమార్​ఉన్నారు.


Next Story

Most Viewed