మార్వాడీల తీరు తెలంగాణ అస్తిత్వానికే ప్రమాదం.. ప్రొఫెసర్ హరగోపాల్ సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-19 09:10:41  IST  )

నేటి తరం మార్వాడీ (Marwadi)ల తీరు తెలంగాణ (Telangana) అస్తిత్వానికే ప్రమాదకరంగా మారిందని ప్రొఫెసర్ హరగోపాల్ (Professor Haragopal) సంచలన వ్యాఖ్యలు చేశారు.

మార్వాడీల తీరు తెలంగాణ అస్తిత్వానికే ప్రమాదం.. ప్రొఫెసర్ హరగోపాల్   సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నేటి తరం మార్వాడీ (Marwadi)ల తీరు తెలంగాణ (Telangana) అస్తిత్వానికే ప్రమాదకరంగా మారిందని ప్రొఫెసర్ హరగోపాల్ (Professor Haragopal) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మార్వాడీల వల్ల తెలంగాణలో చిరు వ్యాపారుల తీవ్రంగా నష్టపోతున్నారని కామెంట్ చేశారు. గతంలో మన రాష్ట్రంలో మార్వాడీలు ఉన్నప్పటికీ అంతా కలిసిమెలిసి వ్యాపారాలు చేసుకునే వారని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని అన్నారు. వ్యాపారాలు చేసుకోవాడానికి మన రాష్ట్రానికే వచ్చి తెలంగాణ సంస్కృతి, భాషనను అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. వాళ్ల తీరు ఇప్పటికైనా మారకపోతే.. తెలంగాణ లాంటి ఉద్యమం మరొకటి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని హెచ్చరించారు. నాడు ఆంధ్ర వలస పాలకులతో యుద్ధం చేయాల్సి వచ్చిందని.. నేడు మార్వాడీలతో ప్రత్యక్ష యుద్ధం తప్పదని ప్రొఫెసర్ హరగోపాల్ జోస్యం చెప్పారు.

Next Story